పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లను జదివి, వారివలె ప్రవర్తించుటకు యత్నించుడి. విద్యనేర్చుకొనిన నిట్టి సంకటములు రావని నా తాత్పర్యముకాదు. కాని యిట్టి సంకటములు సంప్రాప్తించినపుదు మూర్ఖులవలె నిరాశను బొందక, విద్య నేర్చిన స్త్రీలు ధైర్యము నవలంబింతురు. సంకటమును దొలగించుకొనుటకు వారికి ననేక యుక్తులు తోచును. వీరమతికి శస్త్ర మెటుల నుపయోగించినదో, యటులనే విద్య యిప్పటి స్త్రీలకు సంకట సమయమునందుపయోగించును. కనుక, మీ పాతివ్రత్య రక్షణార్థమై మీ రెల్లప్పుడును విద్యయను శస్త్రమును వెంబడి నుంచుకొనుడి.

ఇట్లు నరాధముడగు లాలుదాసును యమసదమునకు బంపి, వాని శరీరమును గుడ్డలో మూటగట్టి వీరమతి యా మూటను గవాక్షంలోనుండి వీధిలో బారవైచెను. తదనంతరము లోపలికి మరియెవరు రాకుండునటుల మేడత్రోవ లోపల బిగియించుకొని యిక నేమేమి విచిత్రములు జరుగునో చూతమని చేత ఖడ్గమును ధరించి గవాక్షమువద్ద నిలువబడెను. అంత రాత్రి గస్తితిరుగు సంరక్షకభటులు కొంద రా మూటను జూచి, విప్పి, దండనాయకుని కుమారుని శవమని తెలిసికొని, తక్షణమే యా సమాచారము దండనాధునికి దెలియ జేసిరి. తన పుత్రుని శవమును జూచి దండనాయకుడు శోకాకులచిత్తుడై, యా శవ మెచ్చటదొరికినదని యా భటుల నడిగెను. జామోతియొక్క గుప్తగృహ సమీపమున దొరికినదని వారు చెప్పగా, నతడు వెంటనే యా వారకాంత యింటికి బోయి లాలుదాసుడేడియని యడిగెను. అందుపై జామోతినవ్వి యత