పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పతివ్రతలను దుష్టుల చరలోనుండి విడిపించుట కయి పతివ్రతల వెంబడి యెల్లప్పుడును దేవదూత లదృశ్యులై తిరుగుచుందురని యొక పాశ్చిమాత్యకవి వ్రాసియున్నాడు. కీచకుని గృహమునకు బోవునపుడు ద్రౌపదీదేవి తనపాతివ్రత్యము రక్షింపవలసినదని సూర్యునికి విన్నవింపగా,

క. "తరణియు దు:ఖిత యగున
   త్తరుణిం గాంచుటకు నత్యుదగ్రభుజావి|
   స్ఫురణాడ్యు నొక్కరక్కసు|
   గరుణార్గ్రమనస్కుడగుచు గ్రక్కున బనిచెన్"

అని మహాభారతమున జదువుచున్నారముగదా? దమయంతి శాపంబున గిరాతుడు దగ్థుడయ్యెననియు విందుము. ఈ దేవదూతలును, రాక్షసుడును, శాపసామర్థ్యమును పతివ్రతా స్త్రీల యొక్క సత్ప్రవర్తనమును, దృడనిశ్చయమును, శౌర్యసాహసములును అనియె చెప్పవచ్చు. తమధర్మమునకు భంగము కలుగుట సంభవించినప్పుడు పతివ్రతా నారీమణులకు గ్రోధాతిరేకము కలుగును. ఆక్రోధాతిశయమునందె దుష్టుని శిక్షించి, పాతివ్రత్యమును సంరక్షించుకొనుసామర్థ్యము గలదు. కనుక నో హిందూసుందరులారా! ప్రాణములైన బోగొట్టుకొని మీ పాతివ్రత్యమును రక్షించుకొనుడు. మీసచ్ఛీలమనుధనమును అపహరించుట కయి యనేక నరచోరులు సదా తత్పరులైయుందురు. మీకు విద్యనేర్పక మూర్ఖులనుజేసి తమవలలో వేసికొనవలెనని యనేకులు స్త్రీవిద్య యక్కరలేదని ప్రతిపాదించెదరు. వారిమాటలు వినకుడి. సద్విద్యను గరచి, పతివ్రతల చరిత్రము