పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నడుమున మొలకట్టురూపమున నొక సన్నఖడ్గము అమరియుండును. ఈఖడ్గములు వంచిన విరగనట్టి యుక్కుతో జేసినవి; ఇవి మొలకట్టు ఆకారముగల బంగారపు వరలో నుండుటవలన జూచువారికి మొలకట్టులవలెనే గానుపించును. మానమునకు మోసము గలుగుచున్న పక్షమున రాజపుత్ర స్త్రీలా ఘడ్గమును ఉపయోగించుచుండిరి. ఆఖడ్గమునే సంకట సమయమున వీరమతి ఉపయోగించి, తనమానమును సంరక్షించుకొనినది! ఆహా! ఇట్టి పతివ్రతా తిలకంబుల గినియాడ నెవరితరము? స్త్రీపురుషుల కందరికినివంద నార్హయైన యీ నారీతిలకము మునితిలకుడైన మనువు

    అరక్షితా గృహే రుద్థా: పురుషై రాప్తకారిభి:
    ఆత్మాన నూత్మనా యాస్తు రక్షేయుస్తాస్సురక్షితా:*

వ్రాసిన అనిన వచనమును సోదాహరణగా స్థాపించి, స్త్రీలకయి మహోపకారము జేసినది. ఓ సోదరీమణులారా! చూచితిరా పాతివ్రత్యప్రభావము! వనితలకు బాతివ్రత్యమే శ్రేయమనియు, గ్రాహ్యమనియు, లలామభూతమనియు నమ్ముడు. ప్రాతివ్రత్యమునకంటె నెక్కుడుధర్మము స్త్రీల కెద్దియులేదు. పతివ్రతా స్త్రీలను సంరక్షించుటకయి సదా సర్వేశ్వరుడు సిద్ధముగా నుండును. పాతివ్రత్యమునకు దన్ను దానే రక్షించుకొను సామర్థ్యముగలదని కొందరు చెప్పుదురు. అనగా పతివ్రతా స్త్రీలెంత దుర్బలలైనను, ఎన్ని సంకటములలో మునిగియున్నను, వారికి స్వసద్గుణములను గాపాడుకొను సామర్థ్యమీశ్వరుడిచ్చును.


  • ఆప్తులైన పురుషులచే గృహమున నిర్బంధింపబడు స్త్రీలు రక్షితురాండ్రు కారు; ఏ స్త్రీలు తమయాత్మను తామే కాపాడుకొందురో వారే సురక్షితురాండ్రు.