పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హించి శంకరు లతనికి సన్యాస మియ్యదలపగా సరసవాణి శంకరులతో నిట్లనియె.

"ఓయతిశ్రేష్ఠ! నీయుద్దేశము నాకు దెలిసినది. నీవు నాపతిని గెలిచితివిగాన నతనిని నీశిష్యునిగా బరిగ్రహించుట యుక్తమే. కాని నీవింకను నాతనిని సంపూర్ణముగా నోడించలేదు. అతని యర్ఠశరీరిణినగు నన్ను గెలిచినగదా మీగెలుపు పూర్ణమగును. మీరు గొప్పపురుషు లయినప్పటికిని మీతో వాదము చేయవలయునని నాకు చాల నుత్కంఠ యున్నది."

శంకరులు - "వాదవివాదమునం దుత్కంథ గలదని నీవు చెప్పితివి కాని నీతో వాదము కానేరదు, గొప్పవారు స్త్రీలతో వాదము చేయరు."

సరసవాణి - "స్వమతమును స్థాపింప దలచువారు తమ మతమును ఖండించువారు పురుషులయినను, స్త్రీలయినను వారితో వాదము చేసి వారిని పరాజితులను చేయుట యత్యంతావశ్యకము. ఇందువలననే పూర్వము యాజ్ఞవల్క్యులవారు గార్గితోను, జనకుడు అబలయైన సులభతోను వాదముసల్పిరి. వారు యశోనిధులు కాకపోయిరా?"

ఇట్లు సరసవాణి చెప్పిన యుక్తివాదమువలనను, పూర్వోదాహరణములవలనను కుంఠితులయి శంకరులవారు సభయందు నామెతో వాదము చయుట కొప్పుకొనిరి.

పరస్పర జయోత్సుకు లయినట్టియు తమబుద్ధిచాతుర్యము వలనను రచియించిన శబ్దమనెడి యమృతముచే విను