పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దలచి ఏలేశ్వరోపాధ్యాయులవా రామెకు విద్యనేర్ప మొదలు పెట్టిరి. కాని విద్య త్వరగా రాకుండినందుల కామె మిగుల చింతించి విద్యార్థులకు బుద్ధివైభవము కలుగుటకై తండ్రి చేసియుంచిన జ్యోతిష్మతియను తైలము నెవ్వరికిని జెప్పక త్రాగెను. అందుపై నామెకు దేహతాప మతిశయిల్ల నింటిలో నుండిన బావిలో దుమికెను. తదనంతరమున నింటిలోనివారామెను వెదకి యెందును గానక తుదకు బావిలో చూచిరి. అప్పటికామె తాపము కొంత చల్లారినందున నామెకు దెలివి వచ్చి వారికి దన వృత్తాంతము నంతను జెప్పెను. అదివిని తండ్రి యామె నా బావిలో మరికొన్ని గడియలుంచి బైటకి దీసెను. నాడు మొదలామెకు విశేషమైన తెలివియు జ్ఞాపక శక్తియు గలిగినందున నాచి తండ్రియొద్దగల సంస్కృత విద్యనంతను నేర్చెను.

విద్యావతి యైనపిదప నీమెకు తీర్థయాత్రలు చేయవలయునని బుద్ధి పొడమగా దండ్రి యందున కంగీకరించి యామెను యాత్రలకంపెను. నాచియు దీర్థాటనమున జక్కగా జేసికొని వచ్చుచుండెను. అప్పుడు కాశి మొదలగు స్థలముల యందీమెకు పండితులతో వాదముచేయుట సంభవించెను. అప్పుడా విద్యావతి వారి నోడించి మిగుల మెప్పుగాంచెను. ఇదిగాక యా పండిత డిల్లీ యాగ్రా మొదలగు స్థలములకరిగి రాజసభలయందు విద్వాంసులతో వాదముచేసి గెలిచి విశేష బహుమతులందెను. ఆమె యా కానుక లన్నియు దీసికొని వచ్చి తండ్రికి జూపి యతనికి దన యాత్రా వృత్తాంతమంతయు