పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వినిపించెను. బ్రాహ్మణుడు కొమార్తెకుంగల వైధవ్యదు:ఖము నంతను మరచి తన కూతురు పుత్రునిగా నెంచి యామె యిట్టి విద్యాసంపన్న యగుటకు మిగుల సంతోషించెను. ఈమె తన చరితము ననుసరించి నాచి నాటకమను నొక నాటకమును సంస్కృతమున రచియించెను. ఈమె విద్యాసంపదలచే మిక్కిలి వైభవము గాంచినందున ఏలేశ్వరోపాధ్యాయులకు బుత్రులు లేని కొరత తెలియకుండెను.

_______