పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాచి

ఈ విద్వాంసురాలు ఏలేశ్వరోపాథ్యాయుల రెండవ కూతురు. ఏలేశ్వరోపాథ్యాయులు ఆంధ్ర బ్రాహ్మణుడు; మిక్కిలి విద్వాంసుడు; ఈయన నివాసస్థలము ఏలేశ్వరపురము. ఈ ఏలేశ్వరపురము శ్రీశైలమునకు బశ్చిమమున నుండును. ఈయన విద్యార్థులకు జెప్పు సంస్కృతము నిత్యమును విని ఈతని యింటివారందరును సంస్కృత మతి స్వచ్ఛముగా మాటాడుచుండిరట. ఈయనయే మన ఆంధ్రదేశమునందంతటను నాడుల భేద మేర్పరచి యాయా నాడులలోనే వివాహాదికము లగునటుల నిబంధన జేసెనని చెప్పెదరు. ఆ విభాగంబులు నేటివరకును మన దేశమున బ్రచారములో నున్నవి. ఈయనకు బుత్రసంతతిలేదు. ముగ్గురు బిడ్డలుమాత్ర ముండిరి.

ఏలేశ్వరోపాధ్యాయులు శా. శకము యొక్క 7 వ శతాబ్దమునందుండినట్లు తెలియుచున్నది కాన నాచి సహిత మా శతాబ్దములోనిదనియే యీహింపవలసియున్నది. ఈమె యాంధ్రబ్రాహ్మణ స్త్రీయైనను నీమె చరితమున కాంధ్ర దేశమునం దెచటను సాధనములు దొరకకపోవుట కెంతయు వ్యసనపడుచు మహారాష్ట్రమునందు దొరకిన యాధారము వలన నీమె యల్పచరితము వ్రాయవలసినదాననైతిని. ఈమె బాలవితంతువు కాన తండ్రి ఈమెకా దు:ఖము తెలియకుండుటకై ఈమెను విద్వాంసురాలినిగా జేయదలచెను. అటుల