పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తకపూరను స్థలమున కరిగి యచట వాసము చేయుచుండెను. ఆయనకీ కొమార్తె తప్ప మరి సంతానముకాని, దగ్గర ఆప్తులు కాని లేకుండిరి. ఈ కన్యకు భాల్యదశయందే మాతృవియోగము సంభవించెను. కాన తండ్రి యామెను ప్రాణపదముగా బెంచుచుండెను. అచట సూరథాన్‌రాయులు కన్యా సహితముగానుండుట విని, యాతని పగతుడగు నా మ్లేచ్ఛు డాతని నటనుండియు బారదోలెను. కాన నతి ప్రియమయిన ఆథోదా పట్టణమును విడిచి యతడు అబూయను పర్వతాగ్రమున వసియింపవలసినవాడాయెను. ఆ సమయమునందు ప్రతి రాజునకు దన రాజ్యము రక్షించుకొనుట యత్యావశ్యకమై యున్నందున సూరథాన్‌రాయు లడిగినను రాజు లెవ్వరును అతనికి దోడు పడరయిరి.

సూరథాన్‌రాయుల కీ కన్య దప్ప పుత్రులు లేనందున నా కన్యచేతనే తన పగతీర్పింప నెంచి యాతడా చిన్నదానికి బుత్రునికిం బోలె యుద్ధవిద్య నేర్పుచుండెను. ఆ కన్యయు నా పర్వత ప్రాంతమునందు దండ్రితోడ నుండి యాతనికి సేవ చేయుచు నాతడు నేర్పిన రణవిద్య శ్రద్ధతో నేర్చుకొనుచుండెను. తారాబాయికి గొంచెముజ్ఞానము తెలిసినప్పటి నుండియు దండ్రి తనకు శస్త్రవిద్యను నేర్పుటకు గారణ మామె తెలిసి కొని యామె యధికోత్సాహముతో శస్త్రాస్త్రవిద్య నభ్యసించి యందు బ్రవీణయయ్యెను. బాల్యదశనుండియు యుద్ధవిద్య నేర్చుకొనుటవలన నామె శరీరము మిగుల దృడమైనదియు, జపలతగలదియు నయ్యెను. అరణ్యవాసమును, తండ్రి