పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూజ్యభావము హెచ్చి యామెపక్షము మాకు భయంకరమయ్యెను"

"గ్వాలేరులో జరిగిన యుద్ధముయొక్క గొప్పపరిణామము ఝాశీరాణీయొక్క మృత్యువు. ఆమె యబల యయినను మాతో దిరుగబడినవారిలో నతిశూరయు నత్యుత్తమ సేనాగ్రణియునై యుండెను."

(2) "ఆయుద్ధమునందు నత్యంత దృడనిశ్చయమును, తేజమును జనానురాగమును గలిగినట్టి సైన్యాధ్యక్షురాలయిన ఝాశీరాణి చంపబడెను." డాక్టరు లో.

(3) "లక్ష్మీబాయి నడి తారుణ్యములో నుండినందున నత్యంత సుందరముగానుండెను. ఆమెమనసు ఉత్సాహపూర్ణముగాను, శరీరము మిక్కిలి సశక్తముగాను నుండెను. ఆమెయందు, ప్రాణముపోయినను చింతలేదు గాని మానహాని సహింపనన్న యభిమానముండెను." మార్టిన్‌దొర.

(4) "ఏ స్త్రీని రాజ్యతంత్రము నడుపుటకు నసమర్ధురాలనియెంచి, మేము రాజ్యభ్రష్టనుగా జేసితిమో యా స్త్రీయే ప్రచండసైన్యముయొక్క యాధిపత్యమును స్వీకరించుటకు సంపూర్ణముగా సమర్థురాలని మాకు నిప్పుడు తెలిసెను." ఎడ్విను ఆర్నోల్డు దొర.

(5) "శత్రువులలో నత్యుత్తమ మనీషి ఝాశీయొక్క మహారాణియే" జస్టిస్ మ్యాకర్తిదొర.


_______