పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విమలదేవి

(అచ్చతెనుగు)

ఈమె మార్వాడలోని రూపనగరమునకు రేడుగానుండిన అమరసింగుని కూతురు. అప్పుడు డీల్లీలోనుండిన రారాజుపేరు ఔరంగజేబు. రజపూతదొరలు కొందరు ఔరంగజేబునకు జడిసి తమబిడ్డల నతనికిచ్చి యతని కనికరమునకు దగినవారయిరి. విమలదేవి తండ్రియు దన బెద్దకూతు నౌరంగజేబున కిచ్చి పెండ్లిచేసెను. రాచకన్నియల నిట్లు తురకల కిచ్చుటకు విమలదేవి యిచ్చ మెచ్చక, తన యుసురులు వోయినను తురకను పెండ్లాడననియు దల్లిదండ్రులు తనకు మంచి రాచకొమరుని వెదకి కూర్చనియెడల దనపాయమంతయు గన్నియగనే గడిపెదననియు దలచెను. ఇట్లుండ నౌరంగజేబున కిల్లాలగు కేసరిబాయను విమలయొక్క యక్క పుట్టి నింటికి వచ్చెను. అప్పుడు విమలదేవి తల్లియగు కౌమారదేవి మొదలయిన వారందరామె రారాజునకునింతి యగుట వలన నామెను మిగుల గారవించిరి. కాని విమలదేవి మాత్ర మామె మొగమును జూడక యేకతమున నుండి ముక్కంటిని గొలుచుచుండెను. అప్పుడచటికి కేసరిబాయి చెలియలిని జూడ వచ్చి యామె గొలుచు బూచుల దొరను దూరసాగెను. అప్పుడు విమలదేవి మిగుల కోపగించి తోబుట్టువునుజూచి "యచ్చపు రాచకులంబున బుట్టి మిగుల పనికిమాలిన కులము వాని జేపట్టిన నిన్నుజూచిన దోసమువచ్చును. నేను నా