పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమ యభిప్రాయమును మాని స్త్రీ విద్యాభిమాను లగుదురనుటకు సందేహములేదు. ఈమె చరితము అమెరికాలోని వారును వ్రాసి మిగుల పూజ్యభావముటొ జదువుచున్నారు.

ఇట్లీయుత్తమసతి దేశదేశాంతరములయందు గీర్తిగాంచి విద్యచే స్త్రీలు బాగుపడుదురేగాని చెడిపోరనియు దుర్గుణములకు విద్యకు విరోధమేగాని విడలేని మైత్రిలేదనియు, స్వచరిత్రమువలన స్థాపించి, విద్యనేర్చిన స్త్రీ లందరు ధర్మము విడుతురనియు, పతిని మన్నింపరనియు స్వచ్ఛంద లగుదురనియు గొందరు చెప్పినమాటలు ద్వేషజన్యములయిన యసత్యవాక్యములనియు, స్థిరపరచినందునను ఆనందీబాయి చరిత్రమునకు నేను "స్త్రీ విద్యావిజయదుందుభి" యనిపేరు పెట్టితిని.


_______