పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరింత యస్వస్థ మయ్యెను. బొంబాయియందును, పూనా యందును, ఆమెకు ఔషధోపచారము లనేకములుచేసి చూచిరి. కాని ఫలము లేకపోయెను. తుదకు 1887 వ సంవత్సరము ఫిబ్రవరి 26 వ తేది రాత్రి పదిగంటలకు దా జన్మించిన పూనాయందే యీ యద్వితీయస్త్రీ పరలోకమున కేగెను. మరణ కాలమున "నాచేతనయినంతవరకు నేనుచేసితి"నని పలికి యామ ప్రాణముల విడిచెను.

చూచుతిరా! యీ ధైర్యవతి సాహసము! ఇట్టిరత్నము లనేకములు మనదేశమునందు గలవు. కాని యా రత్నములను సానబెట్టి ప్రకాశింపజేయుటకు గోపాలరావువంటివారు లేనందున నా రత్నములును రాళ్ళవలె కానిపించుచున్నవి. ఆనందీబాయి సద్గుణములకును, సద్విద్యకును, గోపాలరావే మూలకారణుడనుట కెంతమాత్రము సందేహము లేదు. సాధారణముగా మొగపిల్లలును, ఆడుపిల్లలును వారి చిన్నతనపు చేష్టలవలన మిగుల చెడ్డవారని యనిపించుకొందురు. పురుషులు విద్య నేర్చిన పిదప తమయజ్ఞానమును కొంతవరకు విడిచి మంచివారగుదురు. స్త్రీలో, విద్య నేర్పువారులేక యింటియందు దల్లి ముత్తవ మొదలగువారివలెనె జ్ఞానవంతులును సుగుణ దుర్గుణములు కలవారును నగుదురు. ఆనందీబాయి చిన్నతనమునందు మిగుల చెడ్డదిగా గానుపించుచుండెనుగాని విద్యాభ్యాస మధికమయిన కొలదిని ఆమె మనసు మారెను. ఆమె పరద్వీపమున కేగి యిట్టివిద్యను నేర్చివచ్చినను, గర్వ మామె నంటజాలకుండెను. ఆమె చరితము గని వినినవారలు స్త్రీవిద్యాద్వేషు లయినను