పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భార్యవెళ్ళిన రెండు సంవత్సరములకు గోపాలరావు గారు బయలుదేరి కాలినడకతో నమెరికా కరిగెను. ఆయన తన భార్య నడవడిని గనుగొనదలచి యామెకు దెలుపకయే యకస్మాత్తుగా నచటికిబోయెను. కాని యామె సత్ప్రవర్తన గనిన పిదపగోపాలరావు తా నామెనుగూర్చి శంకించినందుకు పశ్చాత్తాపపడెను. ఇట్లు గొప్ప విద్య నేర్చుకొని అమెరికా దేశమునకు జని, మహాగౌరవమును గాంచియు విశుద్ధచరితగా నుండి, యెల్లప్పుడును సంశయముతోనే యుండెడిపతిని మెప్పించిన యీ పతివ్రతా శిరోమణి ప్రాత:స్మరణీయ యనుటకు సందేహములేదు.

నాలుగు సంవత్సరములు చదివినపిదప ఆనందీబాయి వైద్యవిద్యయందు ప్రవీణురాలని మెప్పుపొందెను. తదనంతర మా దంపతులు అచట జూడదగిన స్థలములను జూచి కార్పెంటరు దొరసానివద్ద సెలవుపుచ్చుకొని స్వదేశమునకు వచ్చిరి. ఆనందీబాయి అమెరికాలో నుండిన కాలముననే కోలాపురపు సర్కారువారామెను తమ స్త్రీ వైద్యశాల కధికారిణిగా నుండుమనియు, నెలకు మూడువందలరూపాయలు వేతనమిత్తు మనియు బిదప నైదువందలవరకు వృద్ధిపొందింపగలమనియు నామెకు దెలిపిరి. కాన నామె యందునకు నొప్పుకొనెను. కాని దేశముయొక్కయు, స్త్రీలయొక్కయు దురదృష్టమువలన జదువుకొను కాలముననే యామెకు క్షయరోగ మంకురించి క్రమముగా వృద్ధియగుచుండెను. రొగముతోడనే యామె మనదేశమునకు వచ్చెను. సముద్ర ప్రయాణమువలన నామెదేహము