పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసినను, భోజనము చేయుమనక ఆమె తినదని యెరిగియు, మాంసాహారములు తినెదవాయని యామెను కేరడములాడి విశేష బాధపెట్టిరి. ఆనందీబాయి వారింత చేసినను వారిపై కోపపడక స్వదేశవియోగము, స్వజన వియోగమువలన గలిగిన దు:ఖమును తానే యాపుచు, దొరకినచో ధాన్యాహారము చేసియు, దొరకనిచో నుపోషముండియు గాలము గడుపుచు స్టీమరుపై వెళ్లుచుండెను. ఆహా! ఇట్టి స్వదేశాభిమానమును స్వధర్మాభిమానమును గల స్త్రీ సర్వజనవంద్య యనుటకు సందేహము గలదా! కొందరు క్రైస్తవమతబోధకులు మొదట తాము మిగుల ప్రేమకలవారుగా నగుపడి, తమ మతము నితరులకు బోధింతురు. వారు తమ బోధవలన దమ మతము నవలంబింపరని వారికి దెలియగా ననేకరీతుల వారి నవమానింతురు. ధర్మగురువులగు వారికిది యెంతమాత్రమును తగినపనికాదు. తోడివారలు తన నట్లుచూచి సహాయమేమియు జేయకుండినను ఆనందీబాయి తనకు బరమేశ్వరుడే సహాయుడని నమ్మియుండెను. పదునెనిమిది సంవత్సరముల వయసునందే యింతటి దృడనిశ్చయమును ధైర్యమును, ఈశ్వరునియందు నమ్మికయు గలిగి వర్తించుట మిగుల స్తుత్యముగదా?

ఇట్లు ధూమనౌకపై బ్రయాణము చేయుచు ననేక ద్వీపములనుగడచి జూన్ 18 వ తేదిని ఆనందీబాయి అమెరికా చేరెను. అచటికి ఆనందీబాయి వచ్చుచున్న వార్తవిని యదివరకే కార్పెంటరు దొరసాని యోడవద్దకివచ్చి ఆనందీబాయి నెదుర్కొనెను. అప్పుడా యిరువురికిని గలిగిన యానంద