పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దనియు నుత్తరమువచ్చెను. దానింగని ఆనందీబాయి కొంచెమాలోచింపగా నాయుత్తరము నీ ప్రయాణము నాపుటకే వ్రాసిరనియు నీ తమ్మునికి నిజముగ ప్రాణాంతముగ నుండిన నీవుపోయి చూచునంతకు నుండడనియు, ఇందువలన నీవు చేయబోవు మహాకార్యమును మానుట మంచిదికాదనియు నామె మనోదేవత యామెకు జెప్పి యామె నిశ్చయము దొలగకుండ జేసెను. ఆహా! దృడనిశ్చయమన నిట్టిదిగదా? చిన్నచిన్న సంకటములు ప్రాప్తించినను భయపడి మనవార లంగీకృతకార్యమును పరిత్యజింతురు. కాని యట్టివారు ఆనందీబాయి చరిత్ర జదివి దృడనిశ్చయమను సద్గుణమును నేర్చు కొనియెదరుగాక.

అంత 1883 వ సంవత్సరము ఏప్రియల్ 7 వ తేదీని ఆనందీబాయి కలకత్తా నగరమునుండి పాతాళలోకమున కరుగ బొగయోడ నెక్కెను. అప్పుడు ఆ దంపతుల కిరువురకును గలిగిన వియోగదు:ఖ మిట్టిదని చెప్ప నెవ్వరితరము? అయినను వారు తమ సుఖములను విడిచి స్వదేశ హితమునకై కష్టముల ననుభవించిరి. వారి స్వదేశభక్తి నెంత పొగడినను తీరదు. త్రోవలో సహవాసముగా నుండిన క్రైస్తవస్త్రీ లామెను తమ మతమునకు ద్రిప్పవలయునని విశేషముగా బోధించిరి. కాని దృడనిశ్చయురాలయిన యాయబల వారికి దగినయుత్తరముల నిచ్చి యా మతమును ఖండించెను. అందు వలన నా యువతులామెను మిగుల తిరస్కారముగా జూచియు ఆమెకు శరీరమస్వస్థముగా నుండినను విచారింపక ఉపోషము