పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మింతంతయని చెప్పుటకు వీలులేదు. కార్పెంటరు దొరసాని ఆనందీబాయి సద్గుణములను నేటికిని మరువలేదు. ఇట్టి స్త్రీలు బహుసంఖ్యలో నొకరుందురని యామె యనుచుండెను.

ఆనందీబాయి అమెరికాలోని న్యూజరసీపట్టణమున కేగగా నచట కార్పెంటరు దొరసానిగారి కుటుంబీకు లందరును ఆమెను బహు మర్యాదచేసిరి. వీరింటనుండియే ఆనందీబాయి తన చదువున కనుకూలమగు తావు వెదకుకొనెను. అచట నున్న నాలుగు నెలలు వృధపుచ్చుక ఆనందీబాయి కుట్టుపని, అల్లికపని, జలతారుపని నేర్చుకొనెను. తదనంతర మామె ఫిలడల్ఫియా యను మహాపట్టణమున వైద్యవిద్య నభ్యసించునటుల స్థిరమయ్యెను.

కొందరు పురుషులుగాని, స్త్రీలుగాని తమదేశమును వదలి పరదేశమున కరిగిన పిదప దమదేశాచారములను విడిచి యాదేశచారములనే స్వీకరింతురు. కాని మా చరిత్రనాయిక యట్లుగాక పాతాళలోకమున కరిగియు దన దేశాచారమును మరువక యా దేశపువారికిని వాటిని నేర్పెను. ఆమె తన స్నేహితురాండ్రకును కార్పెంటరు నింటి వారికిని మహారాష్ట్ర స్త్రీలవలె జడలువేసి చీరలు కట్టింపుచుండెను. తాను న్యూజరసీ పట్టణమున కేగుటకు ముందు తన స్నేహితురాండ్ర కందరకును మహారాష్ట్రపద్ధతి ననుసరించి విందుచేసెను. ఆ దిన మామె తానే తమదేశపు పక్వాన్నములు వండి భోజనములకు కూర్చుండుటకు పీటలువేసి, తినుటకు విస్తరులును దొప్పలును కుట్టి మహారాష్ట్ర దేశాచార ప్రకారము సకల పదార్థములును