పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మగుదుమ"ను నట్టి విచారము లనేకము లామె మనంబున నుద్భవింపసాగెను. రాజభవనమునందు నిరుపయోగములై పడియున్న యనేక శస్త్రములామె కంటపడగా నామెయందు నడగియున్న శౌర్యాగ్ని ప్రజ్వలింపసాగెను. అంత నామె నిలువక, యుద్ధమున కనుకూలమగు పురుషవేషము దాల్చి యనేకాస్త్ర శస్త్రములను ధరియించి కాళికాదేవి ప్రత్యక్షమైనది యనినట్టుగా రాజపుత్రుల సభలోకి బ్రవేశించెను.

సుకుమారమగు మేనితో బురుషవేష ధారిణియు: శస్త్రధారిణియునై వచ్చిన విరాబాయిని గనినతోడనే యచటి రజపూతువీరు లాశ్చర్యమగ్న మానసులయిరి. స్వాతంత్రేచ్ఛయు, స్వధర్మాభిమానమును హృదయనం దుండుటవలన నామె కాంతి మిగుల ప్రజ్వరిల్లెను. ఆమె మిగుల రోషముతో గూడియున్న రాజపుత్రులలో నిట్లనెను. "శూరాగ్రేసరులగు రజపూతులారా! మీరిట్లధోముఖులై చింతిల్లుచు నెవరికొరకు నిరీక్షింపుచున్నారు. మీయందలి శౌర్యధైర్యాది క్షత్రియ గుణము లెటుపోయెను? చితూరుసంస్థానమిపుడే పౌరుష హీనమయ్యెనా? ఇచటి రజపూత వీరులందరు కేవలము శ్వాసోచ్ఛ్వాసముగల పురుగులై పోయిరా ? వీరమాతయగు భారతవర్షము నేడే నిస్తేజమై పోయెనా? మీరు శూరులవంశములయందేల జన్మించిరి? అటుల జన్మించినవారు వైరులకు వెన్నిచ్చి యేల పారివచ్చితిరి? ఇప్పుడింద రేకీభవించి యేమి చింతించెదరు? చితూరు నలంకరించువాడును, మన ప్రాణసమానుడు నగు మహారాజును శత్రువులు కారా