పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశూరు లెంత శౌర్యము గనబరచినను అదియంతయు నిష్ఫలమై ఉదయసింహునకు బరాభవము కలిగెను. అక్బరుబాదుషా తక్షణమే యా పిరికిరాజును బట్టి చెరలోనుంచెను. అందుపై జేయునది లేక రజపూతవీరులు గ్రామమునకు దిరిగిపోయిరి. వారిలో కొందరు తమయిండ్ల కరుగగా వారి స్త్రీలు పరాభవము నొందివచ్చిన భర్తలను, పుత్రులను, సోదరులను లోపలికి రాకుండ తలుపులుమూసి వారిని తిరస్కరింపుచు నిట్లనిరి. "రజపూతకులమునందు మీరేల జన్మించితిరి ? సిగ్గులేక మీ మొగములు మరల మాకు జూపకుడు. సంగ్రామ మరణముగాని, జయముగాని దొరకిననే మీకు కీర్తియు, యశమును కలుగును."

ఉదయసింహుని తురుష్కులు చెరబెట్టిరని తెలియగా రాజభవనమునందంతట నెటుచూచిన దు:ఖమయముగానే యుండెను. అప్పుడు రజపూతు వీరులందరు సభచేసి "ఉదయసింహ మహారాజుగారి నెటుల విడిపించనగు ? శత్రువుల నోడించుట యెట్లు" అని చింతింపసాగిరి. ఇటుల వారనేక తీరుల విచారించి, తోచక చింతాక్రాంతులై కొంతవడి యూరకుండిరి. ఆ సమయమునం దాపట్టణమంతయు మిగుల నుదాసీనముగా నుండెను. కాని మరల క్షణకాలములో నొక యువతి వారి నానందసాగరమునం దోలలాడించెను. ఆస్త్రీ ఉదయసింహుని పత్నియగు విరాబాయియే! నాభర్తను మ్లేచ్ఛులు కైదుచేసిరి. రజపూతు లోడిపోయిరి. చితూరు యిక తురకల యధీనమగును. మనమందర మానీచుల స్వాధీన