పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వతము నందలి తృతీయ స్కంధాంతర్గతమైన కపిలదేవహూతి సంవాదమునుగొని, మిగుల రసవంతముగాను, సులభముగాను, ద్విపదకావ్యముగా రచియింపబడినది. దీనిలో సామాన్య జనంబులగు గూడ సులభముగా తెలియునటుల వేదాంతము వివరింపబడినది. వేంకటాచల మహాత్మ్యమునందు విష్ణుమూర్తి పద్మావతిని వివాహమాడిన కథ మిగుల చిత్రముగా జెప్పబడియున్నది. కడమగ్రంథములేవియు ముద్రింపబడనందున, వానిని గురించి యేమియు వ్రాయుటకు వీలులేదు. "ఈమె కవిత్వమునం దల్ప దోషము లక్కడక్కడ గానవచ్చుచున్నను మొత్తముమీద కవన మతికఠినముగాక, మృదుమధుర రచనను గలదియయి యున్నద"ని కవిచరిత్రమునందు రాయబహదూరు కందుకూరి వీరేశలింగము పంతులవారీమె కవిత్వమును బొగడిరి. ఇట్టి వారిచే బొగడొంద దగిన విద్యయు, గవిత్వశక్తియు గలిగినను నామె యిసుమంతయు గర్వము లేక మిగుల వినయవతిగా నుండెనని రాజయోగసారములోని యీ క్రింది ద్విపదలు వెల్లడించు చున్నవి.

ద్వి. వినరయ్య కవులార విద్వాంసులార
    వినరయ్య మీరెల్ల విమలాత్ములార
    ఘనయతిప్రాస సంగతులు నే నెరుంగ
    వరుస నాక్షేపింపవలదు సత్కృపను

ఈమె రచియించిన గ్రంథములు తఱిగొండ నృసింహస్వామి కంకితములు చేయబడినవి. ఈమె శృంగార రసాధి దేవత యగు కృష్ణుని భక్తురాలయినను, ఆమెకు దన గ్రంథ