పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రూరమైనది యయినను, గొందరు యువతులకిది సహగమనము కన్నను విశేష భయంకరమయినదని తోచుచున్నది. వారిట్లు విరూపులై నలుగురులో నవమానకరమగు నిట్టి బ్రతుకు బ్రతుకుట కంటెను సహగమనము చేసి యొక గడియ దు:ఖముతో దేహము విడచుట నూరురెట్లెక్కువ సులభమని తలచుచున్నారు. వారు సహగమనము లేకపోవుటకు వివేషచింత నొంది దాని మాన్పినవారినే క్రూరులని నిందింపుచున్నారు. సాధారణముగ పురుషులకయినను దుస్సహమగు నవమానము కలిగి బ్రతుకుటకంటెను, మరణమే సుఖదాయకముగ నుండునని తోచుట సహజము. ముందు దమ కవమానము కలుగునని తెలిసి యాత్మహత్య చేసికొనిన పురుషు లెందరో కలరు. ఇందువలన సహితము నవమానముకంటె మరణమే మేలని జనులకు దోచునని మనకు దెలియుచున్నది. కాన నస్మద్దేశ బాంధవులందరును మన దేశములోని స్త్రీలకు గలుగుచున్న యీ వ్యసనకరమగు నవమానమును దొలగింప బ్రయత్నింతురు గాత.

ఈమె మిక్కిలి వృద్ధురాలయి కాలధర్మము నొందెను. 1841 వ సంవత్సరము వరకీమె జీవించియున్నట్లు తెలియుచున్నది. బాలవితంతువైనందున నీమెభర్త నామగోత్రము లెచటను గానరావు. వెంగమాంబచే రచియింపబడిన గ్రంథములలో రాజయోగసార మను వేదాంతపరమయిన ద్విపద కావ్యమును, వెంకటాచల మహాత్మ్యమును మాత్రమును ముద్రింపబడి యున్నవి. వీనిలో రాజయోగసారము భాగ