పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములయం దెక్కడను శృంగార వాక్యములను జొప్పింప నిష్టము లేక యుండెను. అందువలనను నామె కృష్ణుని నిట్లు స్తుతియించెను.

శా. శృంగారా కృతితోడ వచ్చిమనముల్ శృంకోసారంబుతో
    డం గూడంబుగ జెప్పు నీవనిన నట్లే జెప్పలేకున్న నన్
    ముంగోపంబున జూచి లేచి యట నే మ్రొక్కంగ మన్నించి త
    చ్ఛృంగారోక్తులు తానె పల్కికొను నా శ్రీకృష్ణు సేవించెదన్.

ఇందువలన దన గ్రంథములయందు శృంగార వాక్యముల నిముడ్చుటకు దన కెంతమాత్రము నిష్టము లేకుండగా సందర్భానుసారముగా నా గ్రంథములయం దక్కడక్కడ వచ్చిన శృంగారపద్యములను శ్రీకృష్ణుడే రచియించెనని యామె తెలుపుచున్నది. ఈ విద్యావతి కవనరీతిని దెలుపుట కయి ముద్రితగ్రంథములోని కొన్ని పద్యము లిందుదాహరించి యామె చరితము ముగించెదను.

వేంకటాచలమాహాత్మ్యము

ఉ. రామనృపాల, ఘోరతర రావణశౌర్యవిఫాల, భవ్య సు
   త్రామ సురార్య యోగిజన తాపసపాల, కృపాలవాల, శ్రీ
   భూమిసుతాత్మలోల, పరిపూర్ణసుకీర్తివిశాల, వానర
   స్తోమముతోడ వచ్చు మిము జూచి కృతార్థులమైతి మిద్ధరన్. ఆ 1

చ. విని యది భీతి నొందుచు వివేకముతో ద్విజు మోముజూచి యి
   ట్లనియెను జారకాంతను మహా విషసర్పమునంటి యెవ్వరై
   నను గడతేరినారె నిను నమ్మిన భార్యను వీడి నన్ను బొం
   దిన నిహమున్ బరంబు చెడు ధీరతతో జను బ్రాహ్మణోత్తమా! ఆ 4