పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తఱిగొండ వెంగమాంబ

క. కందునమాటల సామెత| లందముగా గూర్చి చెప్ప నవి తెనుగునకుం
   బొందై రుచియై వీనుల| విందై మరి కానిపించు విబుధుల కెల్లన్.

తఱిగొండ వెంగమాంబ వసిష్ఠగోత్రికుడును, నందవరీక బ్రాహ్మణుడును నగు కృష్ణయ్య యను నాతని పుత్రిక. ఈమె వాసస్థానము కడపమండలములోని తఱిగొండయని యూహింపబడుచున్నది. వెంగమాంబ తెలుగునందు విద్వాంసురాలని యామెచే రచింపబడిన గ్రంథములే వేనోళ్ల దెలుపుచున్నవి. వేంకటాచలమాహాత్మ్యమునం దీమె ఆశ్వాసాదిని వేసిన శ్లోకములవలన సంస్కృతము నందును నీమెకు గొంత పరిచయము గలదని తోచుచున్నది. ఈమె బాలవితంతువు. వేదాంతగ్రంథ పఠనమువలనను, గ్రంథరచనవలనను, కడపమండలములోనేగాక తెనుగుదేశమునం దంతటను వెంగమ్మగారి కీర్తి విస్తరిల్లెను. కాన జను లామెయం దధిక విశ్వాసము గలిగి దేశాచార ప్రకార మామెపై ననేక కథలను జెప్పుకొనసాగిరి. అవియనియు నిందుదాహరించుట యనావశ్యకముగాన నొకటి రెంటిని మాత్ర మిందుదాహరించెదను.

వెంగమాంబ గ్రంథరచనచేయుచు నేకాంతముగా నొక గదిలో కూర్చునుచుండెను. అచటినుండి యామె యీవలికి రాగానే యామె ముఖమునం దానందమును, దేహమునందు సుగంధమును గానవచ్చుచుండెనట. ఇందువలన నామె వదిన లామెయందు దోషము గలదని తలచి, దానిని కనిపెట్టుటకయి