పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యా గది ద్వారముకడ కాచియుండిరట. అంత గొంతసేపటికి లోపల నెవ్వరో పురుషుడు నవ్వినట్టును,నృత్యము చేసినట్టును వారికి వినబడెనట. అందుపై వారు తమ భర్తలను బిలిచి, తామువిన్న సంగతులను తెల్పిరట. అట్లందరు గుమిగూడి వెంగమ్మను తలుపుతెరువమనగా, ఆమె నిర్భయంగా తలుపుతీసెనట. అప్పుడు వారా యర్రనంతను శోధించి పురుషుని నెవ్వనిగానక యామె నడుగగా శ్రీకృష్ణుడు దప్ప నన్యపురుషుడేల వచ్చునని పలికెనట. ఇవి యన్నియు నామె భక్తివిశేషమును దెలుపు కథలేగాని వేరుగాదు.

వెంగమాంబ తన జీవితకాలమునం దంతను శిరోజములను తీయలేదని చెప్పెదరు. ఆమె బహుదినములు శిరీజముల నుంచుకొనినందున జను లామె యన్నదమ్ములను బహిష్కరించెదమని బెదరించిరి. వారంతటితో నూరకుండక శంకరస్వాములవారు రాగా నాలోకగురువున కీమెసంగతి విన్నవించిరి. అందుపై నా స్వాములవారు వెంకమ్మను బిలిచి నీశిరోజములు తీయించుకొమ్మని చెప్పెను. అందుకామె యించుకయు జంకక పరమేశ్వరు డిచ్చినవి మనుజులేల తీయవలెననియు, అందువలన పరపురుషస్పర్శదోషము కలుగుననియు, ఒక పర్యాయము తీసినవి మరల రానియెడల నది పరమేశ్వరునకు సమ్మతమనియు, అట్లుగాక మరుదినముననే మరల వెండ్రుకలు మొలచుటచే నది పరమేశ్వరునకు నసమ్మతమని స్పష్టముగా దెలియుచున్నదనియు వాదించెను. అంతటితో నూరకుండక గురు వాజ్ఞాపించగా బంధువులామెను బట్టుకొని బలవంతముగా కేశవపనము