పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమానులరయితిరి. గాన, నింట ముగ్గురు స్త్రీలమయినా మన్న యర్థముగల యీ వాక్యములు చెవిసోకిన వెంటనే ఖడ్గతిక్కన మిగుల లజ్జించి యపుడే మరల యుద్ధమున కరిగి మిగుల కీర్తి గాంచెను. కొంద రిది యంతయు దిక్కన తల్లియొక్కపని యనియెదరు. ఇట్లుపూర్వ మాంధ్రదేశమునందు పూజనీయలగు వీరపత్నులు, వీరమాతలు, వీరభగినులు అనేకు లుండుట వలననే ఆంధ్రదేశములోని బ్రాహ్మణులలోగూడ క్షాత్రతేజ మత్యంత ప్రబలమై యుండెనని చెప్పుటకు సందేహములేదు.


_______