పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమవయస్కుడగు తన పుత్రుని నిదురపుచ్చి తాను సమీపమున నేదో కుట్టుకొనుచు కూర్చుండెను. ఇంతలో ద్వారమావల నేమో కాలుచప్పుడు వినవచ్చినందున నాదాది లేచి చూచెను. అప్పుడు పైని జెప్పబడిన మంగలివాడు మిగుల నాతురతతో వచ్చుటగని, పన్నా "నీవింత తొందరగావచ్చి పిచ్చివానివలె నాతురడవయ్యెదవేమి? యేదియేని యప్రియమా? యని యడిగెను. అందుకా నా పితుడు "అవును మిగుల ఘాతకాబోవుచున్నది. ఇంక నొక గడియ కాబనబీరుడు రాజపుత్రుని జంప నిట కేతెంచెను." ఈ వాక్యములు చెవిని సోకగానే పన్నా దేహము ఝుల్లుమన నొక యూర్ధ్వశ్వాసను విడిచి యిట్లనియె. "నే నిన్నిదినములు వచ్చునని భీతిల్లుచుండినదే నేడు ప్రాప్తమయ్యెను. ఆదుష్టునిపై నా కిదివరకే యనుమాన ముండెను. కాని నే నాడుదాననగుటచే నేమిచేయుటకు జాలకుంటిని. ఏది యెటులైనను నిప్పుడు రాజపుత్రుని రక్షించుట మన కర్తవ్యము" అందుకా మంగలి "యది బహుదుర్ఘటము. అయినను నీకేదేని యాలోచన దోచినచో త్వరగా జెప్పుము. నీవెట్టి కార్యము చెప్పినను నేను నిర్వహింపగలను" అనెను. తదనంతరము పన్నా యొకించుక విచారించి "రాజపుత్రుని నొకానొక సుస్థలమునకు గొనిపోవుదమ"ని చెప్పెను. "అట్లు చేయుటకు వీలులేదు. నే డే బాలకులను రాజనగరు వెలుపలికి గొనిపోకుండ పాపాత్ముడు కట్టడి చేసెను." పన్నా అటులైన నీ రాజపుత్రుని నొక తట్టలో బెట్టి పైన పెంట బోసి నీ కిచ్చెదను. నీవు దానిని గొనిచని సురక్షితమగుచోట నుంచు