పుట:Abaddhala veta revised.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నమ్మకాలు వదలుకోరు. జ్యోతిష్యం గిట్టుబాటైన వ్యాపారంగా మార్చేశారు గనుక అది నిలదొక్కుకోడానికే ప్రయత్నిస్తుంది. అందుకే కమబద్ధమైన ఎదుర్కోలు సాగాలి.

అతీంద్రియ శక్తులు(పేరాసైకాలజీ)

దూరాన వున్న మనిషి మనస్సులో వున్న ఆలోచన చెప్పగలగడం టెలిపతి అంటున్నారు. అలా చెప్పిన వ్యక్తికి, అవతల వ్యక్తికి మధ్య ఏ సంబంధమూ వుండదు.

దూరాన వున్న వస్తువుల్ని కంటిచూపుతో,మనోశక్తితో కదలించడం,ప్రభావం చూపడాన్ని సైకో కెనిసిస్ అంటున్నారు.

మామూలుగా తెలిసిన ఇంద్రియశక్తులకు మించిన శక్తులు వున్న వ్యక్తిని మహాత్ముడని, బాబా అని, చెబుతున్నారు.

వీటన్నిటినీ పరిశీలించడానికి 19వ శతాబ్దంలో మొదలు పెట్టి నేటి వరకూ చాలా శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. ఇంగ్లండ్ లో యూరోప్ దేశాలలో, అమెరికాలో యీ శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా యింతవరకూ ఎక్కడా పేరాసైకాలజీ, అతీంద్రియశక్తులు శాస్త్రీయంగా రుజువు కాలేదు.

అమెరికాలో జె.బి.రైన్ మొదటి డ్యూక్ యూనివర్శిటీలో పేరాసైకాలజీ శాఖను ఆరంభించి పరిశోధించారు. చివరకు తేలిందేమంటే, రైన్ చిత్తశుద్ధితో చేసినా ఆయన వద్ద పనిచేసినవారు మోసగించారు. శాస్త్రీయ పరిశోధనలనే పేరిట దొంగ లెక్కలు చూపి రుజువు అయినట్లు ప్రకటించారు. తీరా వాటిని శాస్త్రీయంగా పరిశోధిస్తే ఫలితాలు రాలేదు. రైన్ దంపతులు తమ తప్పును ఒప్పుకున్నారు. డ్యూక్ యూనివర్శిటీలో పేరాసైకాలజీ శాఖను ఎత్తివేశారు. కాని చాలా చోట్ల యీ అతీంద్రియ శక్తుల దుకాణాలు వెలశాయి.

ఇంగ్లండ్ లో ఆర్థర్ కోస్లర్ యీ అతీంద్రియ శక్తులపై తెగరాసి, నిధులు సమకూర్చి, పరిశోధనలు చేయించాడు. అయినా రుజువుకాలేదు. ఎప్పటికప్పుడు పరువు నిలబెట్టుకోడానికి పేరాసైకాలజీ వారు తిప్పలు బడుతూనే వున్నారు. పేకముక్కల ప్రయోగం గణాంక పరిశీలనలు, గోడ అవతల మనిషిని పెట్టి అతడి ఆలోచనలు చెప్పాలనే పరిశోధన, యిలా రకరకాలుగా చేసి, బోర్లాపడ్డారు. ఆశ వదులుకోలేక యింకా పేరాసైకాలజీని రుజువు చేద్దామనుకుంటున్నారు.

సైంటిఫిక్ గా చూస్తే దూరాన వున్న వ్యక్తి మనస్సులో ఏముందో తెలుసుకోడానికి, అవతలవ్యక్తి మెదడునుండి వచ్చే ఆలోచనలు పట్టుకోవాలి. మెదడులోని కోట్లాది న్యూరాన్ లు ఆలోచన, ఆవేదన, నిర్ణయాలు తీసుకునే పనిచెస్తుంటాయి. న్యూరాన్లు ఏగ్జాన్లతో కలుస్తాయి. అంటే సంకేతాలు పంపిస్తాయి. అలా పంపించే తీరును విద్యుత్ చర్యగా పేర్కొంటారు. మెదడు విద్యుత్ రసాయనిక చర్య ద్వారా పనిచేస్తుంది. అవతల వ్యక్తి మెదడులో యివన్నీ