పుట:Abaddhala veta revised.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పనిచేసే తీరు ఏదో ఒక విధంగా పొక్కితే గాని, టెలిపతి సాద్యంకాదు. అదెలా సాధ్యమో ఇంతవరకూ పరిశోధనలో టెలిపతివారు చెప్పలేకపోయారు. ఎలాగో పట్టుకున్నారనుకుందాం. అవతలవ్యక్తి మెదడులో వచ్చే ఇంపల్స్ లను టెలిపతి ఎలా విప్పి చెబుతుంది. దీన్ని డికోడింగ్ అంటారు. అదెలా సాధ్యమో చెప్పలేకపోయారు.

సిట్రాన్ అనే కణాలను మెదడు విడుదల చెస్తుందని వాటిని అధ్యయనం చేసి టెలిపతి పనిచేస్తుందని బుకాయించారు. కాని సిట్రాన్ వునికి యింతవరకు తేలలేదు!

టెలిపతిలో ఏ మాత్రం వాస్తవం వున్నా లాటరీ టిక్కెట్ల నంబరు చెప్పి గెలవడం సాధ్యమెగదా. అదెందుకు చేయలేకపోయారు? గుర్రపు పందాలలో ఏ గుర్రం గెలుస్తుందో చెప్పలేకపోవడానికి కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు టెలిపతి సమాధానం చెప్పదు.

దూరాన్నుండే వస్తువులు కదలించే ప్రయోగాలు యూరిగెల్లర్ చేయగా,అందులో మోసాన్ని,బూటకాన్ని జేమ్స్ రాండి బయటపెట్టారు. ఇందులోనే చూపుతోనే స్పూన్ లు వంచడం కూడ వుంది.

దూరాన్నుండి ఒక వస్తువూ చూపుతోనే కదలించాలంటే ఎంత శక్తి వినియోగించాలి అనే పరిశోధనలు చేశారు. అలాంటి పని మానవుడి మెదడు ఉత్పత్తి చేయాల్సిన శక్తి ప్రమాదకర ఓల్టేజితో వుంటుంది. అది కూడా సాధ్యం కాదని రుజువైంది. బల్లమీద ఒక గ్లాసును చూపుతో కదలించాలంటే 100 మిల్లిఓల్ట్స్ శక్తి మెదడులో ఉత్పత్తి కావాలి. 0.25 ఏంస్ అదనపు ఎనర్జీ ఇందులో సగం గుండెలో ప్రసరిస్తే మనిషి చచ్చిపోతాడు! కొందరు రేడియో సంకేతాల సామ్యం తెచ్చారు. రేడియో సిగ్నల్స్ సమాచారాన్ని యిస్తాయే గాని వస్తువుల్ని కదలించవు. చంచాలను వంచవు. విద్యుదయస్కాంతం ద్వారా సైకొకెనిసిస్ పనిచేస్తుందనడానికే రుజువులు దొరకలేదు. ఇంతవరకూ సైన్స్ కు తెలిసిన శక్తుల వలన టెలిపతి టెలికెనెసిస్ పనిచేయడం సాధ్యం కాదు. ఇక మిగిలింది మూఢనమ్మకమే. అదే కొందరిని నడిపిస్తున్నది.

కొందరు శాస్త్రజ్ఞులు చిత్తశుద్ధితో అతీంద్రియ శక్తుల విషయంలో కృషి చేశారు. అందులో ష్మిట్, జాన్, జె.బి.రైన్ పేర్కొనదగినవారు.

- హేతువాది, జూన్ 2001
బాబాలు - ఆశ్రమాలు - ఆస్తులు

ఆశ్రమాలకు ఆస్తులకూ చాలా దగ్గర సంబంధం వుంది. దేశంలో బాబాలు, మాతలు, సన్యాసులు, స్వాములు భక్తపేరిట, ఆధ్యాత్మికత పేరిట ఆస్తులు కూడగట్టారు. ఆస్తులు కాపాడుకోడానికి ఆస్తి పన్ను మినహాయింపు తెచ్చుకున్నారు. మతం, ధార్మికత, మొదలైనమాటల