పుట:Abaddhala veta revised.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిశోధించిన దానినిబట్టి నాలుగు శక్తులున్నాయి. అందులో వీక్ నూక్లియర్, స్ట్రాంగ్, విద్యుదయస్కాంతశక్తులు అని తేల్చారు.

అస్థిరంగా వుండే నూక్లియర్ క్షీణదశకు వీక్ నూక్లియర్ ఫోర్స్ కారణమౌతుంది.

స్ట్రాంగ్ నూక్లియర్ ఫోర్స్ అణువు పరమాణువుల స్థాయిలో అతి సమీపస్థలంలో పనిచేస్తుంది.

విద్యుదయస్కాంత శక్తి పనిచేయడానికి వస్తువుల్ని ఛార్జి చేయాలి. అప్పుడే అది చర్యకు ఉపక్రమించి రసాయనిక మార్పులకు దారితీస్తుంది.

గురుత్వాకర్షణ శక్తి ఏవైనా పెద్ద వస్తువుల మధ్య పనిచేస్తుంది. అంటే భూమి చంద్రుడు లేదా చంద్రుడు సముద్రాలంతటి పెద్ద వాటి మధ్య పనిచేస్తుందన్నమాట. నాలుగు శక్తులలో ఇది చాలా బలహీనమైనదంటాడు. మనిషికీ గ్రహానికీ ప్రత్యక్షంగా ప్రభావం చూపే శక్తి కనబడలేదు. ఇక మిగిలింది సూర్యుడి నుండి వచ్చే వెలుగు మాత్రమే. ఎప్పుడు పడిన వెలుతురును ప్రమాణంగా స్వీకరించాలి? తల్లిగర్భం ధరించిన తరువాత ప్రసవించే వరకూ పడే వెలుగును జ్యోతిష్యం స్వీకరించడం లేదు. వెలుగుకు ప్రభావం వుంటే ఆ 9 మాసాల వెలుగు కిరణాలమాటేమిటి?

జ్యోతిష్యులు కొందరు చెప్పే అయస్కాంత ప్రకంపనాల ప్రభావం ఇంతవరకూ రుజువు కాలేదు. జ్యోతిష్యంలో నక్షత్రాల ప్రస్తావన వుంది. భూమికి సమీప నక్షత్రం నుండి వెలుగు రావడానికి నాలుగున్నర సంవత్సరాలు పడుతుంది. మిగిలిన వాటి దూరం శతాబ్దాలకు మించిపోయింది. కనుక ఈ కిరణాల ప్రభావం పరిగణలోకి జ్యోతిష్యం తీసుకోజాలదు.

జ్యోతిష్యంలో పేర్కొనే రాశిచక్రాలు, గుర్తులు ఊహమాత్రమైనవి. అంటే వాటికి ఉనికి లేదు. గ్రహాలలో రాహువు కేతువూ అంతే. అవి కేవలం నమ్మకాలు. గ్రహాల ప్రభావం వుందని తాత్కాలికంగా అంగీకరిస్తే, కొత్తగా కనుగొన్న నెప్ట్యూన్, యురేనస్, ప్లూటో మాటేమిటి? అవి కనుగొనక ముందున్న జ్యోతిష్యం అంతా తప్పు గదా? ప్రాచీన జ్యోతిష్యం గ్రంథాలన్నీ తిరగరాయాలి గదా.

ఒకే సమయంలో పుట్టిన కవలలపై జ్యోతిష్య ప్రభావం భిన్నంగా వుండడాన్ని అధ్యయనం చేశారా?

ఆకాశంలో వున్న సమీప శకలాలు(మీటరాయిట్స్, అస్టరాయిడ్స్) తోకచుక్కల ప్రభావం జ్యోతిష్యం పరిగణలోకి తీసుకోదా? ఎందుకని?

నక్షత్రాలు పుడతాయి. గిడతాయి. అటువంటప్పుడు నక్షత్రాల ప్రభావాన్ని గురించి,జ్యోతిష్యం ఏమంటుంది? జ్యోతిష్యం నమ్మకస్తులకు యీ విషయాలను వివరించాలి. వెంటనే