పుట:Abaddhala veta revised.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30 సంవత్సరాల పాటు చికాగో విశ్వవిద్యాలయంలో పనిచేసిన నెఫ్ సోషల్ థాట్ పై ఒక సంఘాన్ని ఏర్పరచాడు.

నెఫ్ లెక్చరర్ గా చాలా క్రమబద్ధమైన వాడని షిల్స్ అన్నాడు. బ్రిటీష్ బొగ్గు పరిశ్రమ గురించి విద్యార్ధులను ఆకట్టుకునే లెక్చర్ యివ్వడం నెఫ్ కే చెల్లిందన్నాడు. ఆర్ధిక రంగంలో కవిత్వాన్ని జొప్పించి, టి.ఎస్.ఇలియట్ ను ప్రస్తావించగల సమర్ధత నెఫ్ కు వున్నది. తన పరిశోధనా ఫలితాలను బేరీజు వేసి క్లాస్ లో చెప్పడం ఆయన అద్భుత ప్రతిభగా షిల్స్ చెప్పారు. ప్రతి తరగతిలో కొత్త విశేషాలను చెబుతూ, జర్మనీలోని విద్యారంగ లక్షణాలు అమెరికాలో ప్రవేశపెట్టిన ఖ్యాతి నెఫ్ కు దక్కాలని షిల్స్ అంటారు.

కార్ల్ మన్ హైం: షిల్స్ రాసిన మేధావులలో కార్ల్ మన్ హైం సుప్రసిద్ధ సామాజిక శాస్త్రజ్ఞుడు. మేధావులకు సంబంధించిన ఆయన దృక్పధం షిల్స్ ను ఆకట్టుకున్నది. కాంట్ వలె తానూ ఆకర్షించాలని మన్ హైం భావించినా,అది సఫలం కాలేదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో ఆయనకు తగిన ఆదరణ లభించ లేదు.

అమెరికాలో తన రచనలు గురించి ఏమనుకుంటున్నారో అనే విషయమై అతడు శ్రద్ధగాపట్టించుకునే వాడు.

కార్ల్ పాపర్ రాసిన పావర్టి ఆఫ్ హిస్టారిసిజం విమర్శ ప్రధానంగా మన్ హైంను దృష్టిలో పెట్టుకున్నదే. హైక్ (Hayey) రాసిన రోడ్ టు సెర్భడం కూడా మన్ హైంపై విమర్శతోకూడిందే. సోషియాలజీ ప్రొఫెసర్ మారిస్ గింజ్ బర్గ్ కూడా మన్ హైంపై ధ్వజమెత్తి విమర్శలు చేశాడు. మన్ హైం చనిపోయినప్పుడు ఎడ్వర్డ్ షిల్స్ వెళ్ళగా, గింజ్ బర్గ్ తన భర్తను చంపేసినట్లు (విమర్శలతో!) ఆయన భార్య విలపిస్తూ అన్నది.

గలీలియో సొసైటీలో సభ్యులుగా మైకెల్ పొలాని, మన్ హైంలు సన్నిహితులు. కాని అభిప్రాయాలలో విరుద్ధంగా వుండేవారు. టి.యస్.ఇలియట్ యితడిమేధస్సును శ్లాఘించాడు. అయినా ఇంగ్లండులో ప్రవాసిగా మన్ హైం యిమడలేక పోయాడు.

అర్నాల్డ్ డాంట్ మొమిగ్లి యోనో: మేధావులకు, పరిశోధకులకు తెలిసిన మొమిగ్లియానో,బహుళ ప్రచారం లేని గొప్ప వ్యక్తి. అతని రచనలన్నీ 750 వరకూ వున్నవి. ఇతడు 1908లో పుట్టాడు. యూదు, ఆక్స్ ఫర్డ్ లో కృషి చేశాడు. ఇటలోలో రాని రాణింపు అక్కడ వచ్చింది. చికాగోలో విజటింట్ ప్రొఫెసర్ గా వుండేవాడు. గిబ్బన్ గొప్పవాడని, మైకల్ రోస్టో విజఫ్ (Mikhail Rostovzeff) ప్రాచీన చరిత్ర పండితులలో గొప్ప వాడని మొమిగ్లోయానో అనేవాడు. కేంబ్రిడ్జి ప్రాచీన చరిత్రలో యితడి ప్రతిభ కనిపిస్తుంది. చివరి దశలో బాగుగా గుర్తింపు, రాణింపు, ప్రచారం లభించగా తృప్తి చెందిన మేధావి. మతనమ్మకాలు ఉపరితల విషయాలుగా భావించరాదని, యీ విషయమై మార్క్సిస్టు దృక్పధం సరైనది కాదని ఆయన భావించాడు.