పుట:Abaddhala veta revised.pdf/370

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లేదా నీరు కలిపి చేసే పద్ధతి ఒకటి, అలా కలిపి, బాగా పది సెకండ్ల పాటు వూపి, అందులో ఒక పాలు మళ్ళి తీసుకోని 99 చుక్కలు సారా లేదా నీరు కలిపేవారు ఇలా చేసుకుంటూ పోయే మందుల్ని 6C, 9E, 30C అలా పేర్లు పెట్టారు. ఈ పద్ధతిలో ఒక పాలు ఔషధం. 9 పాళ్ళు నీరు లేదా సారా కలుపుతూపోతే 3X, 6X, 30X అంటూ పేర్లు పెట్టారు. సులభంగా కరగని వాటిని మెత్తగా నూరి తరువాత యిా ప్రక్రియ చేసేవారు. ఇలా పలచబరిచే పద్ధతిని శక్తివంతం చేయడంగా (పొటెంటైజేషన్) అన్నారు. రసాయన శాస్త్రంలో అవగాడ్రో కనుగొన్న సూత్రం ప్రకారం మూలపదార్థం కోల్పోకుండా పలచబరచడానికి ఒక పరిమితి వుంది. 6023*1023 అనే యీ పరిమితిని హోమియోలో 12Cతో లేదా 24Xతో పోల్చవచ్చు. అంటే ఆ తరువాత మందులలో మందు వుండదన్న మాట. అయితే పదార్ధం లేకున్నా శక్తి వున్నదనీ అది జీవశక్తి(వైటల్ ఫోర్సు)ని ప్రకోచింపజేసి పనిచేస్తుందని హానిమాన్ నమ్మాడు. హోమియో మందుల్ని పరిశీలిస్తే మందు ఏమీ వుండదని తేలింది. నమ్మకంతో బ్రతికేవారిని శాస్త్రీయ పద్ధతిలో నిరూపించమనడం సాధ్యం కాదు.

మనుషుల్లో నమ్మకాలు ప్రబలి వున్నాయి. ప్రతి రోగి కూడా వైద్యుడి దగ్గర చిన్న పిల్లవాడి మనస్తత్వంతో వుంటాడు. వీటిని ఆసరాగా తీసుకొని హోమియో వైద్యులు దోపిడీ చేస్తున్నారు. యెన్నో ప్రశ్నలు వేసి, అలోపతిని తిట్టి రోగిలో బలహీనతను పెంచుతున్నారు. మన రోగులలో ఒక పట్టాన డాక్టర్ శక్తి సామర్ధ్యాలను ప్రశ్నించే తత్వం లేదు. ఆ విషయం కూడా హోమియోవారు బాగా వాడుకుంటున్నారు. హోమియో రీసెర్చి అని బోర్డులు పెట్టి భ్రమలు కలుగజేస్తున్నారు. సర్వరోగ నివారిణిగా హోమియోను ముద్రవేస్తున్నారు. ఎయిడ్స్, మెదడువాపు వంటి వ్యాధులు రాకుండా ఆపగల శక్తి వుందని ప్రచారం చేస్తున్నారు. వైద్యరంగంలో ప్రభుత్వానికి వున్న బలహీనతల్ని బాగా వాడుకుంటున్నారు. అలోపతికి వున్న నియమ నిబంధన హోమియోపై రాకుండా అధికార్లను రాజకీయనాయకులను పట్టుకొని జాగ్రత్తలు పడుతున్నారు. పత్రికలు ద్వారా మూఢనమ్మకాన్ని ప్రచారం చేసి, సంపాదిస్తున్నారు. మానవవాదులు ప్రశ్నించేది ఒక్కటే. హోమియో శాస్త్రీయపద్ధతికి రుజువు కాగలదా? అయితే ఆధారాలేమిటి?

హోమియోను ప్రభుత్వం నిషేధించాలని మానవవాదులు కోరడంలేదు. శాస్త్రీయం అని రుజువుపరిచేవరకూ ప్రభుత్వ నిధులు యివ్వరాదని మాత్రమే కోరుతున్నారు. అమెరికాలోని నార్త్ కరోలైనా రాష్ట్రంలో హోమియో వైద్యాన్ని ఆపారు. కోర్టులో హోమియో శాస్త్రీయమని రుజువు కానందుకే యిలా చేశారు.ఇంగ్లండ్ లో మెడికల్ బోర్డు అజమాయిషీ క్రిందకు హోమియోను తెచ్చారు. మనదేశంలో హోమియో పేరిట మారుమూల గ్రామాలలో సైతం సంపాదన జరుగుతుంది. అశాస్త్రీయమైన వైద్యాన్ని పాటిస్తే సమాజ నేరమౌతుంది, రాజ్యాంగంలో 51Ah ప్రాథమిక విధి ప్రకారం హోమియో పట్ల నిరసన తెలుపడం హ్యుమనిజమే.

శాస్త్రీయపద్ధతిని మనకు అనుకూలమైన చోట వాడుకుంటామని, మన వృత్తికి ఆదాయానికి