పుట:Abaddhala veta revised.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లండు లో బారిస్టర్ చదువు సందర్భంగా ప్రకాశానికి రాజకీయాల వాసన తగిలింది. దాంతోపాటే మాంసాహారం, సిగరెట్టు కూడా అలవాటయ్యాయి. కాంగ్రెస్ లో అతివాది అయిన లాలాలజపతిరాయ్ తో పరిచయమయింది. కాంగ్రెసు రాజకీయాలలో తిలక్ కూడా అతివాదే. వీరి అతివాదం అంటే మతవాదమే. ఇది ప్రకాశానికి వచ్చింది. గోఖలే వంటి మితవాదులు ప్రకాశానికిష్టంలేదు.

1893లో మద్రాసులో వివేకానంద వలన కొంత ప్రేరేపణ పొందానని ప్రకాశం చెప్పుకున్నాడు. 1907ఓ సూరత్ కాంగ్రెసు మహాసభలలో అతివాదులు-మితవాదులు చెప్పులతో కొట్టుకున్న సందర్భంగా, ప్రకాశం అతివాదుల పక్షాన్నే వున్నాడు. ఆ తరువాత "ఎప్పుడైనా కులాసాగా కాంగ్రెస్ కి వెడుతూ వుండేవాణ్ణి. అంతకంటె ఎక్కువగా కాంగ్రెస్ ఎప్పుడూ నన్ను ఆకర్షించలేకపోయింది" అని ప్రకాశం స్పష్టీకరించాడు.

1907 నుంచి మద్రాస్ లో బారిస్టర్ గా ప్రాక్టీస్ చేశాడు. 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా జరిపిన ఈ ప్రాక్టీస్ లో మొదటి ఏడు సంవత్సరాలు అప్పులు తీర్చి సంసారాన్ని పోషిస్తూ తరువాత ఏడు సంవత్సరాలలో బాగా సంపన్నుడయ్యాడు. భూములు, బంగళాలు కొని స్థిరాస్తి పరుడయ్యాడు. మధ్యలో అనిబిసెంట్ రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యాడు.

గాంధీజీ 1921లో ఇచ్చిన సహాయ నిరాకరణోద్యమ పిలుపును అందుకొని కోర్టు ప్రాక్టీసు వదలుకొని రాజకీయాలలోకి పూర్తిగా ప్రవేశించినవారిలో ప్రకాశం ఒకరు. కాని గాంధీశిష్యుడుగా లేదా అనుచరుడుగా ప్రకాశం ఎప్పుడూ రాణించలేదు. మనస్సు అతివాదంపై నిమగ్నమై వుండటంవలన, అప్పటికి తిలక్ పోవడం వలన సి.ఆర్.దాసుకు, మోతీలాల్ కు చేరువగా మెలిగాడు. ఈ వైరుధ్యమే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది.

స్వరాజ్య పత్రికను 1921 అక్టోబరులో మద్రాసునుంచి ప్రకాశం ప్రారంభించాడు. అప్పుడే గాంధీజీతోనూ, రాజగోపాలాచారితోనూ ప్రకాశానికి పరిచయం ఏర్పడింది. కాని ఆ పరిచయ స్నేహం అట్టేకాలం నిలవలేదు. స్వరాజ్యపత్రికను మూసేయమని గాంధీజీ పదేపదే సలహా ఇవ్వడం ప్రకాశం మొండికేయడం జరిగింది. గాంధీజీ తన కుమారుడు దేవదాస్ గాంధీకి రాజీజీ కుమార్తె లక్ష్మితో పెళ్ళిచేశాడు. ఆ విధంగా వియ్యంకులుగా సన్నిహితులైవారు ప్రకాశాన్ని జీవితాంతమూ వ్యతిరేకించారు. గాంధీతో ఢీకొనడమంటే ఆనాడు మాటలు కాదు అలాగే "గుంటనక్క"గా పేరు తెచ్చుకున్న రాజాజీ ఎత్తుగడలను గమనించడం, ఎదుర్కోవటం సామాన్యం కాదు.

గాంధేయులకు స్వరాజ్యవాదులకూ మధ్య నిలబడి "సెంట్రల్ పార్టీ" పెట్టిన ప్రకాశం సఫలం కాలేదు.

1921లో ప్లీడరీ వృత్తి వదలడం, స్వరాజ్యపత్రిక ప్రారంభించడంతో ప్రకాశం జీవితంలో పెద్ద మలుపు తిరిగింది. రాజకీయాలలో ఉంటూ వృత్తిని సాగిస్తే అదొక తీరు. కాని మరొక యావ