పుట:Abaddhala veta revised.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రత్యేకంగా సంగీతం సమకూర్చాడు. 1784లో పారిస్ లో అంధురాలుగా ఆమెను జనం పొగుడుతుంటే, అపఖ్యాతి పాలైన మెస్మర్ అక్కడే వున్నాడు!

1778లో వియన్నా నుండి పారిస్ వెళ్ళిపోయిన మెస్మర్ ఎకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడి వద్దకు చేరి తన మెస్మరిజాన్ని శాస్త్రీయంగా పరిశీలించమన్నాడు. అధ్యక్షుడు ఛార్లస్ లి రాయ్ యీ విషయం పరిశీలించడానికి మెస్మర్ ను రాసి యివ్వమన్నాడు. మెస్మర్ 27 ప్రతిపాదనలు రాశాడు. చికిత్స సంపూర్ణతకు తన విధానం పరాకాష్ఠ అని మెస్మర్ గొప్పలు చెప్పుకున్నాడు. తన వైద్యవిధానం ప్రచారం చేయడానికి ప్రభుత్వం నియమించిన మతసంస్థ కావాలన్నాడు. ప్రభుత్వం, మతంతో నిమిత్తం లేకుండా సైన్సు పరిశోధన జరుగుతున్న పునర్వికాస కాలంలో మెస్మర్ అలా కోరాడు.

1778లో మెస్మర్, విశ్వసమాజం అనే రహస్య సంస్థ పారిస్ లో స్థాపించి తన వైద్య ప్రచారానికి పూనుకున్నాడు. దీని శాఖలు ఫ్రాన్స్ లో ఏర్పడ్డాయి. మెస్మర్ కు ఆదాయం పెరిగింది. తాను కనుగొన్న పశు అయస్కాంతం తనకు తప్ప ఎవరికీ తెలియదని, దీనిని ఖండించే అధికారం ఎవరికీ లేదని ప్రచారం చేసుకున్నాడు. ఛార్లస్ ది ఎప్లాన్స్ , నికొలస్ బెర్ గస్ అనే యిరువురు శిష్యులు మెస్మర్ కు బాగా ప్రచారం చేసి పెట్టారు.

1784 మార్చి 12న లూయీ 16 ఒక విచారణ కమిషన్ మెస్మర్ గురించి నియమించారు. ఇది సైన్స్ అకాడమీ కోరికపై జరిగింది. మెస్మర్ శిష్యుడు ఛార్లస్ ఆస్పత్రిలో విచారణ సాగించారు. రసాయన శాస్త్రజ్ఞుడు ఏంటొని లవోసియర్,జీన్ సిల్వన్ బెయిలీ(ఖగోళ శాస్త్రజ్ఞుడు) జోసెఫ్ ఇగ్నాస్ గిలోటన్ (వైద్యుడు-గిలోటన్ ఉరి ఇతడిపేర వచ్చింది)బెంజమిన్ ఫ్రాంక్లిన్(అప్పట్లో అమెరికా రాయబారిగా ఫ్రాన్స్ లో వున్న సైంటిస్టు) కమిషన్ లో వున్నారు.

మెస్మర్ చికిత్సలో అయస్కాంత ప్రభావం ఏదీ లేదని కమిషన్ కనుగొన్నది. ఇదంతా తప్పుడు శాస్త్రంగా తేల్చారు. మెస్మర్ వైద్యంలో చికిత్సపొంది నయం అయిందన్నవారిలో చాలామంది శారీరక రోగులు కాదని కమిషన్ కనుగొన్నది. నిజంగా జబ్బున్న ఇద్దరు వ్యక్తులపై మెస్మర్ అయస్కాంత చికిత్స ప్రభావం ఏమీ లేదని గమనించారు. ఒకామె ఉబ్బసం రోగి. సెంట్ ఆర్మన్ అనే విధవ, మరొక యువతి ఆన్స్ం. ఆరేళ్ళ క్షయరోగి బాలిక కూడా ఎలాంటి నివారణ పొందలేదు.

మెస్మర్ శాస్త్రీయ పంథా తప్పుడుది అని కమిషన్ క్షుణ్ణంగా పేర్కొన్నది. మెస్మర్ చెప్పే ద్రవం లేదని కూడా చెప్పింది. 1784 ఆగస్టు 11న కమిషన్ తుది నివేదికలో మెస్మర్ ను ఖండించింది. మెస్మర్ పేర్కొన్న విశ్వద్రవ్య పదార్థ చర్య ఏదీ కనిపించలేదనీ, కొందరిలో వూహల కారణంగా శరీరంలో మూర్ఛలు వస్తున్నాయనీ చెప్పారు. ఊహలు రాకుండా అయస్కాంతం చేయగలిగిందేమీ లేదన్నారు. అయస్కాంతం శూన్యం. ఊహే అతిముఖ్యం అన్నారు. అంటే