పుట:Abaddhala veta revised.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మెస్మర్ చికిత్స మానసిక సంబంధమే తప్ప,శరీరానికి వస్తే అతడేమీ చేయజాలడన్న మాట. పశు అయస్కాంతం అనేది సందేహాస్పదం అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. ఇలాంటి వాటి ఆధారంతో చికిత్స చేయబూనడం భ్రమే అన్నాడు. ఈ విధంగా కమిషన్ నివేదిక మెస్మర్ కు వ్యతిరేకంగా వచ్చింది. 1785లో ఆయన కుడిభుజం వంటివారు కూడా మెస్మర్ కు ఎదురు తిరిగారు. అయస్కాంత చికిత్స గురించి ఆయన అనుచరుడు బెర్గాసే ఉపన్యాసం యివ్వడాన్ని మెస్మర్ ఖండించాడు. రహస్యం బట్టబయలు చేసినట్లు భావించాడు. త్వరలోనే మెస్మర్ పారిస్ కు స్వస్తి పలకవలసి వచ్చింది.

1799లో మెస్మర్ (అది 1957లో ఇంగ్లీషులో జెరోం ఈడెన్ అనువదించారు) మానసిక రుగ్మతకు భౌతిక ఆధారం (అయస్కాంతం) కనుగొన్నవాడిగా తనకు గుర్తింపు రావాలని ఆకాంక్షించాడు. ప్రకృతి శాస్త్రంలో కొత్త సూత్రాలు కనుగొన్నట్లు మెస్మర్ భావించినా,అది రుజువు కాలేదు. మనుషులకు, జంతువులకు అయస్కాంత ద్రవ్యం వుందని మెస్మర్ వూహించాడు. ఇది ఇతరులు చూడలేదని, తనకు మాత్రమే తెలిసిన దేవతావస్త్రాలుగా మెస్మర్ పేర్కొన్నాడు! ఈ విశ్వద్రవ్యం మెస్మర్ దృష్టిలో సర్వరోగనివారిణి. మెస్మర్ సృష్టించుకున్న కల్పనాలోకం నిజమని నమ్మాడు. భక్తితో రోగాలు కుదురుతాయనే వారికీ మెస్మర్ కూ తేడా లేదు. అయితే శరీరానికి వచ్చిన రోగాలు మెస్మర్ చికిత్స వలన నయం కాలేదు. రోగాలన్నీ నయం చేయవచ్చుగాని రోగుల్ని కాదని మెస్మర్ చెప్పాడు! రోగలక్షణాలు శరీరానికి లేనప్పుడు అవి మానసిక చికిత్సలో ప్రధాన భాగాలుగా చెప్పారు. ఇలా మానసిక రోగాలు కుదుర్చుతామనే మెస్మర్ వంటివారే నేటి చికిత్సకు ఆధారమయ్యారు. నయం కావడం, కాకపోవడం ఆయా వైద్యుల మాటల ప్రతిభ, నాటకీయత, రోగుల మనోలక్షణాల బట్టి వుంటుందన్న మాట! ఇదీ మెస్మర్ కధ.

కనుకట్టు విద్యగా నేటికీ యిది ప్రచారంలో వుంది!

- హేతువాది, నవంబరు 1991

ఫ్రాయిడ్ సృష్టించిన కొత్త మతం

ఫ్రాయిడ్‌లో నిజాలు - భ్రమలు

సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వుంది. మార్క్స్ భావాలు ఎంతగా ఆకర్షించాయో, మానసికరంగంలో ఫ్రాయిడ్ యీ శతాబ్దంలో అంతగా ఆకర్షించాడనవచ్చు. విచిత్రమేమంటే అత్యధిక సంఖ్యాకులు మతాన్ని గుడ్డిగా అనుసరిస్తున్నట్లే, ప్రశ్నించకుండా నమ్ముతున్నట్లే. ఫ్రాయిడ్ ఎవరో, ఏం చెప్పాడో, ఏం చేశాడో తెలుసుకోకుండానే అనుసరిస్తున్నారు. ఈ లక్షణాలు చదువుకున్నవారిలో కనిపిస్తున్నందున మనం యింకా జాగ్రత్తగా పరిశీలించాలి.

అమెరికాలో సుప్రసిద్ధ సైకియాట్రిస్ట్, హ్యూమనిస్ట్ థామస్ సాజ్ (Thomas Szaajz) గత