పుట:Abaddhala veta revised.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురువు సి.ఎ.మార్టిన్ పారిస్ వెడుతూ ఇక్కడ బెల్ వ్యూలో మకాం పెట్టాడు. పారిస్ లో ఆయన మత అధ్యయనం చేయనున్నారు. గత రెండేళ్ళుగా ఆయన చైనా, జపానుల్లో వున్నారు" (శాన్ ఫ్రాన్ సిస్కో క్రానికల్ జూన్ 16,1916).

మరో స్థానిక దినపత్రిక శాన్ ఫ్రాన్ సిస్కో ఎగ్జామినర్ కూడా రాయ్ విషయం లోపల పేజీలలో అతిసాధారణ అంశంగా ప్రచురించింది. "రెవరెండ్ సి.ఎ. మార్టిన్, ఇండియాలో పాండిచేరివాసి, ప్రస్తుతం బెల్ వ్యూలో వున్నారు. ఆయన రోమన్ కాథలిక్. రెండేళ్ళుగా చైనాలో మత ప్రచారకుడుగా, విద్యార్థిగా వున్నారు. పారిస్ వెడుతున్నారు, చైనాలో పరిస్థితులు విపరీత గందరగోళంగా వున్నట్లు ఆయన వర్ణించారు". (జూన్ 16,1916)

ఎం.ఎన్.రాయ్ ను పత్రికా ప్రతినిధులు కలిసి వుంటారు. ఆయన చెప్పిన కథనాన్ని వారు చిన్న వార్తగా ప్రచురించారు.

మొదటి ప్రపంచ యుద్ధం మధ్యలో వున్న సమయంలో, బ్రిటిష్ పోలీసుల సమాచారం యింకా అమెరికాకు చేరక ముందు, రాయ్ ఒక మతగురువు వేషంలో గడ్డం పెంచి అలా అమెరికాలో అడుగుపెట్టాడు. ఇండియాలో ఉగ్రజాతీయవాదిగా బ్రిటిష్ వారితో పోరాడుతున్నప్పుడు రాయ్ సహచరుడుగా జదుగోపాల్ ముఖర్జీ వుండేవాడు. అతడి సోదరుడు ధనగోపాల్ ముఖర్జి అంతకు ముందు కొన్నాళ్ళుగా అమెరికాలో వుంటున్నాడు. రాయ్ హోటల్ ఖాళీచేసి పాలో ఆల్టో అనే ప్రదేశంలో వున్న స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రాంగణంలో ప్రవేశించాడు. అక్కడ ధనగోపాల్ ముఖర్జీని కలిశాడు.

ధనగోపాల్ ముఖర్జీ 1906 నాటికే అమెరికా వచ్చాడు. అతడు బెంగాలీ పురోహితుడి కుమారుడు. ధన్ గోపాల్ స్టాన్ ఫర్డ్ లో చేరి 1914లో గ్రాడ్యుయేట్ అయ్యాడు. రాయ్ వచ్చే సరికి అదీ పరిస్థితి. ధన్ గోపాల్ రచయిత, కవి. జనీస్, ఫ్రెంచి భాషలు మాట్లాడగల ప్రతిభాశాలి. అతడు ఎధెల్ రేడ్యూగన్ అనే అమెరికన్ ఐరిష్ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 1915లో గ్రాడ్యుయేట్ అయింది. రాయ్ వచ్చేసరికి ధన్ గోపాల్, ఎథెల్ డేటింగ్(ప్రేమ సంసారం) చేస్తున్నారు. వారికి అతిథిగా వచ్చిన రాయ్ కు అక్కడే ఎవిలిన్ ట్రెంట్ పరిచయమైంది. ఎవిలిన్ కూడా రాయ్ వచ్చేనాటికి స్టాన్ ఫర్డ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, ఉద్యోగాన్వేషణలో వున్నది. ఎవిలిన్, ఎథెల్ సన్నిహిత స్నేహితురాళ్ళుగా వున్నారు. ఆ విధంగా రాయ్-ఎవిలిన్ లు కలుసుకున్నారు. అది రాయ్ జీవితంలో పెద్ద మలుపు. ఎవిలిన్ జీవితంలో గొప్పమార్పు.

నరేంద్రనాథ్ భట్టాచార్య ఎలియాస్ చార్లెస్ మార్టిన్ స్టాన్ ఫర్డ్ లో మానవేంద్రనాధ్ రాయ్ గా మారాడు. అవిలిన్, రాయ్ లు ప్రేమించుకున్నారు. డేటింగ్ ప్రారంభించారు. అమెరికాలో పెళ్ళికాక ముందు పరస్పరం అవగహన చేసుకోడానికి, భవిష్యత్తులో సుఖంగా గడపడానికి