పుట:Abaddhala veta revised.pdf/228

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పొందుపరుస్తున్నాను. లోగడ వెలికిరాని సంగతులు గనుక ఆసక్తికరంగా వుండగలవు. పదవులు లేకుండా ప్రపంచ రాజకీయాలలో ప్రజల దృష్టిని ఆకర్షించిన రాయ్ జీవితంలో వెల్లడికాని సత్యాలలో కొన్నిటినైనా పూరించడమే యీ పరిశోధన ఉద్దేశం.

రాయ్ తన స్వీయ గాథలలో తన అమెరికా జీవితాన్ని గురించి స్తూలంగా ప్రస్తావించాడు. కొన్ని వదలివేశాడు. మరికొన్ని జ్ఞాపకం వుండకపోవచ్చు. కావాలని చెప్పకుండా దాటేసిన అంశాలు వున్నాయి. ఇప్పుడు అవన్నీ చరిత్రలో భాగం గనుక, పరిశోధనాత్మకంగా వెల్లడిస్తున్నాను.

అమెరికాలో ఎం.ఎన్.రాయ్ జీవితం పెద్ద మలుపు. పేరు మార్చుకున్నాడు. పెళ్ళి చేసుకున్నాడు. జాతీయ ఉగ్రవాదం సడలించి, సంవత్సరం పాటు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, రెండున్నర సంవత్సరాలు మెక్సికోలో వున్న రాయ్ పూర్తిగా మారిపోయాడు.

జర్మనీ సహాయంతో బ్రిటిష్ వారిని భారతదేశం నుండి వెళ్ళగొట్టాలని ఎం.ఎన్.రాయ్ ఆనాడు భావించాడు. అలాంటి ఆలోచన సుభాష్ చంద్రబోసు 25 ఏళ్ళ తరువాత చేశాడు. ఇండియా నుండి జావా వెళ్ళిన రాయ్, తిరిగి వెనక్కు వెళ్ళజాలక, చైనా, జపాన్ ల మీదుగా అమెరికా బయలుదేరాడు. నిప్పన్ మారో అనే ఓడలో ఓక్లహోమా నుండి అమెరికా పశ్చిమ తీరమైన శాన్ ఫ్రాన్ సిస్కోకు జూన్ 16(1916)న చేరుకున్నాడు.

నిప్పన్ మారో అనే ఓడ జూన్ 15(1916) రేవుకు వస్తున్నట్లు స్థానిక పత్రిక ప్రకటించింది. (డైలీ కమర్షియల్ న్యూస్ 1916 జూన్ 15) ఇలాంటి వార్తను ముందు రోజు కూడా ఆ పత్రిక ప్రచురించింది. బహుశ ఓడరాక ఒక రోజు ఆలశ్యమై వుంటుంది. ఆ ఓడలో ఎం.ఎన్.రాయ్ ప్రయాణం చేశాడు. ఓడలో విదేశీ ప్రయాణీకుల సమాచారం ప్రకారం రాయ్ పేరు మార్టిన్ చార్లెస్ అలెస్, వయస్సు 28 సంవత్సరాలు. క్రైస్తవ మతస్తుడు. ఫ్రెంచి జాతీయుడు. శాశ్వత చిరునామా, దేవాలయం. పాండిచేరి, ఇండియా, చేరదలచిన స్థలం పారిస్. స్నేహితులు, బంధువులు ఎవరూ లేరు. 6 అడుగుల ఎత్తు. నలుపు రంగు. గడ్డం వుంది. పుట్టిన స్థలం హైతి. నగరం అయోనియా. అలాంటి మారువేషంలో మారు పేరులో, బ్రిటిష్ పోలీస్ ను తప్పించుకుంటూ రాయ్ తొలి ప్రపంచ యుద్ధకాలంలో అమెరికాలో అడుగుపెట్టాడు. మే 28న ఓక్లహోమాలో బయలుదేరిన ఓడ ఫసిఫిక్ మహాసముద్రంలో 18 రోజులు ప్రయాణం చేసి శాన్ ఫ్రాన్ సిస్కో చేరిందన్న మాట.

ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాయ్ మౌనం వహించక, అమెరికాలో నీగ్రోలు అక్కడి పాలకులపై తిరగబడి తమ హక్కుల కోసం పోరాడాలని ప్రయాణికులతో చెప్పాడట. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ రికార్డులలో యీ విషయం ప్రస్తావించారు.

శాన్ ఫ్రాన్ సిస్కోలో బెల్ వ్యూ అనే హోటల్ లో రాయ్ బస చేశాడు. శాన్ ఫ్రాన్ సిస్కో క్రానికల్ పత్రిక యీ విషయం లోపల పేజీలలో చాలా అప్రధానంగా, చిన్న అక్షరాలలో 'హోటల్ కబుర్లు' అనే శీర్షిక కింద ప్రకటించింది. "చాలాకాలంగా ఇండియాలో గడిపిన రోమన్ కాథలిక్ మత