పుట:Abaddhala veta revised.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోరాడుతున్నప్పుడు గోఖలే సందర్శించాడు. గాంధీ ఆయన్ను తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆదరించాడు. ప్రభుత్వం కూడా గోఖలేను గౌరవంగా చూచింది. 1913 అక్టోబరు 28 గాంధీ, 2037 పురుషులు, 127 స్త్రీలు, 57 మంది పిల్లలతోసహా మినీ దండి మార్చివంటిది జరిపించి,అరెస్టు అయ్యాడు.

దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు పరిశోధనలు,పోరాటాలు చేసిన గాంధి,1914 జులైలో ఇండియాకు వచ్చేశారు. స్వాగతాలు, సన్మానాలు అందుకున్నారు. గోఖలే సలహాపై దేశం చుట్టివచ్చి, అహమ్మదాబాద్ వద్ద సబర్మతి ఆశ్రమం స్థాపించారు. నేత పరిశ్రమలో కార్మికుల పక్షాన అంబాలాల్ శారాభాయిపై పోరాడారు. ప్రచారం లభించింది.

బీహార్ లోని చంపరాన్ లోని నీలిమందు రైతుల పక్షాన బ్రిటిష్ వారిపై పోరాడిన గాంధీకి దేశవ్యాప్తంగా పేరొచ్చింది. గుజరాత్ లోని కేడాజిల్లా రైతులు దుర్భిక్షం వలన పన్నులు చెల్లించలేకపోతుండగా, అధికారులు వారిని పీడించారు. గాంధీ తన సత్యాగ్రహ ఆయుధాన్ని రైతుల పక్షాన ప్రయోగించారు.

1919 ఏప్రిల్ 19 రౌలట్ సత్యాగ్రహోద్యమాన్ని గాంధి నిలిపేశారు. సత్యాగ్రహం అహింసకు దారితీయడం,బ్రిటిష్ సైనికుల్ని హతమార్చడం ఇందుకు కారణం. తన అంచనాలు హిమాలయాలంత తప్పులుగా పరిణమించాయని గాంధి ఒప్పుకున్నారు. ఇదంతా గాంధీ గొప్పతనాన్ని చాటింది.

1919లో మోతీలాల్ నెహ్రూ గాంధీని మహాత్ముడన్నారు. ఆ మాట గాంధికి అతుక్కుపోయింది. 48 సంవత్సరాలకు గాంధీ జాతిపితగా మారాడు.

కాంగ్రెస్ లో తిలక్ మరణానంతరం, గాంధీ తిరుగులేని నాయకుడయ్యాడు. ముస్లింలను కలుపుకపోవాలనే ధోరణి బాగా చూపెట్టారు. ఖిలాఫత్ ఉద్యమాన్ని బలపరచారు. ముస్లింలలో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్,అబుల్ కలాం ఆజాద్,అలీ సోదరులు, సుహ్రవర్దీ,అన్వారి వంటి నాయకులు జాతీయోద్యమంలో గాంధీ అనుచరులయ్యారు. కాని ముస్లిం ఓటర్లు,గాంధీని ఆమోదించలేదు. ఈశ్వర-అల్లా తేరేనాం ఒప్పుకోలేదు.

1920 నుండే కాంగ్రెసుకు అనధికార నియంతగా మారిన గాంధీ పన్నుల నిరాకరణ సత్యాగ్రహం,అహింసాయుత చట్ట వ్యతిరేకత,నిరాహారదీక్షల్ని నిరసన ఆయుధాలుగా ప్రయోగించారు. సామాన్య ప్రజలలో ముఖ్యంగా మధ్యతరగతి వారిలో చైతన్యం తెచ్చారు. 1925-30 మధ్య తన స్వీయచరిత్ర రాశారు. దేశపర్యటన చేశారు. ఖద్దరు ప్రచారం గావించారు. హరిజన, నవజీవన్ పత్రికలు పెట్టారు.

1930లో అహమ్మదాబాద్ వదలేసిన గాంధీ చనిపోయేవరకూ మళ్ళీఅహమ్మదాబాద్ లో