పుట:Abaddhala veta revised.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర్రాక్టీసు చేద్దామనుకున్నారు. ఆయేడు కలకత్తా కాంగ్రెసు సభలలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా నుండి పిలుపురాగా మళ్ళీ వెళ్ళారు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు. 31వ సంవత్సరం నుండి తాను-తన భార్య కస్తూరిబా స్నేహితులుగా మెలగాలనీ, సంభోగం వద్దనీ పెళ్ళి అయిన తరువాత, సంతానం కలిగిన అనంతరం బ్రహ్మచారిగా వుండడం సాధ్యమేననీ గాంధీ ఒట్టుపెట్టుకున్నారు. అయితే లైంగిక కామన చాలా బలవంతమైన మానసిక-శారీరక ప్రకృతి. పట్టుబట్టి ఆపేస్తే ఆ ప్రవృత్తి అనేక రూపాలలో బయటపడుతుంది. బ్రహ్మచర్యం అనేది భారతీయ తత్వంలో ఉన్నతమైనదిగా చిత్రీకరించారు. సంభోగంలో కూడా రేతస్సుస్కలనం కాకుండా ఆపేస్తే మెదడుకు ఆ శక్తిని పంపించగలిగితే, ఆ వ్యక్తి సాధకుడౌతాడని నమ్మారు. తాంత్రికంలో కుండలినీ విద్యపేరిట ఇలాంటివి చిత్రించారు. ఆధారాలు లేని యిా ఆచారాలు పాటించిన వారి బాధలు వర్ణనాతీతం. గాంధిగారు జీవితమంతా తన బాధను కప్పిపుచ్చుకోడానికి సెక్స్ పరిశోధనలు చేశారు. కలల్లో రేతస్సుస్కలనం అయింది. తన బ్రహ్మచర్య శక్తిని జీవితంలో చివరి దశవరకూ ఆయన పరీక్షించుకుంటూపోయారు. కస్తూరిబా అంగీకరించడంతో గాంధీ తన బ్రహ్మచర్యాన్ని దీక్షగా దక్షిణాఫ్రికాలోని రోజులనుండే పాటించారు. టాల్ స్టాయ్ ఫారమ్,ఫేనిక్స్ ఫారమ్ ల పేరిట దక్షిణాఫ్రికాలోన రెండు శిబిరాలు స్థాపించారు. తన నమ్మకాలను ఆచరించడానికి కొందరు యువతీ యువకులను చేర్చుకొని, సత్యాగ్రహం మొదలు సెక్స్ వరకూ పరిశోధనలు చేశారు. టాల్ స్టాయ్ ఫారం లో ఒక చెరువు లో యువతీయువకులను బట్టలు తీసేసి, స్నానాలు చేయమన్నారు. ఇదద్రు యువతులు ఒక యువకుడు స్నానం చేస్తూ సరససల్లాపాలు సాగించినట్లు గాంధీకి తెలిసింది. ఆ యిద్దరు అమ్మాయిలకూ జుట్టు కత్తిరించేశాడు. అబ్బాయి జోలికిపోలేదు.

భారతీయులు దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం ద్వారా సాధించవలసిన అంశాలు గాంధీజీ నేర్పాడు. ఇంగ్లండ్ వెళ్ళి విజ్ఞప్తులు సమర్పించాడు. తిరిగివస్తూ 1909 ఓడలో వారం రోజులలో "హింద్ స్వరాజ్" రాశాడు. అందులో గాంధీ నమ్మకాలు వెల్లడయ్యాయి. చివరివరకూ వాటిని మార్చుకోలేదు. అప్పటికీ టాల్ స్టాయ్, రస్కిన్ ల ప్రభావం ఆయనపై బాగా కనిపించింది. హింద్ స్వరాజ్ లోనే బ్రిటిష్ పార్లమెంటును వ్యభిచార సంస్థగా గాంధి చిత్రించారు.

గాంధి తన భార్య కస్తూరిబా పట్ల చాలా సందర్భాలలో అమానుషంగా ప్రవర్తించాడు. దక్షిణాఫ్రికాలో వుండగా, మలవిసర్జన తరువాత సెప్టిక్ లెట్రిన్ పద్ధతులు అవలంబించి, ఎవరి దొడ్దిని వారే కప్పిపుచ్చాలన్నాడు. కస్తూరిబాతోపాటు ఆశ్రమవాసులు అలాగే పాటించారు. అతిథులు ఇతరులు వస్తే వారి మలవిసర్జన శుభ్రం చేయమని కస్తూరిబాను ఆదేశించాడు. అది భరించలేక, ఇంట్లోనుంచి వెళ్ళిపోతానని కస్తూరిబా అంటే తలుపుతీసి ఆమెను గాంధి బయటకు గెంటాడు. అలాంటి నిరంకుశ ప్రవర్తన భార్యపట్ల, స్త్రీలపట్ల గాంధి చూపాడు. గాంధి తన సంతానం పట్ల కూడా క్రూరంగానే ప్రవర్తించాడు. పెద్ద కుమారుడు హరిలాల్ ప్రేమించి పెళ్లి చెసుకుంటానంటే, నా కొడుకువికాదు పొమ్మన్నాడు. దక్షిణాఫ్రికాలో జాతి విచక్షపై గాంధీ