పుట:Abaddhala veta revised.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇండియా రావడం చరిత్రలో భాగంగా మారింది. అప్పుడు జరిగిన హింసాకాండ, హత్యలు, మతద్వేషం గాఢంగా ఉభయులలోనూ నాటుకపోయాయి. దేశవిభజన కారణంగా ఇండియాలో ముస్లింల శాతం 23 నుండి 10 శాతానికి తగ్గిపోయింది. కుటుంబ నియంత్రణ ముస్లింలు మతరీత్యా పాటించరు. జనాభా పెంచుకొని, క్రమేణా, ఎన్నాళ్ళకైనా సరే, ఇండియాను ఇస్లాం రాజ్యం చేసుకోవాలని ముస్లిం మతవాదుల లక్ష్యం. ఇది అప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని జిన్నా గ్రహించి, పాకిస్తాన్ కావాలన్నాడు. దేశంలో వున్న ముస్లింలకే సమస్య పట్టుకున్నది.

మిగిలిన కొద్దిమంది జాతీయ ముస్లిం నాయకులు పదవులలో, పార్టీలలో, రాజకీయాలలో పాల్గొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తొలి నెహ్రూ మంత్రిమండలి నుండీ అధికారంలో వున్నారు. మతవాదం విడనాడమని ఆయన చేసిన విజ్ఞప్తిని ముస్లింలు పెడచెవినబెట్టారు. ముస్లిం మతనాయకులదే ఆధిపత్యం అయింది.

దేశవిభజన జరిగిన కొద్దిరోజులకే ఒక ఛాందస హిందువు గాంధీని హత్య చేశాడు. కొంతకాలం ముస్లింల సమస్య ప్రకోపించకుండా ఆగిపోయింది.

రాం, రహీం ఒకటేనని, ఈశ్వరుడు-అల్లా అంతా ఒకే దైవం అని గాంధీ నినదించాడు. ఒక చేత్తో గీత,మరో చేత ఖురాన్ పట్టుకొని ప్రార్థనలు చేశాడు.మత సామరస్యతకు యీ ధోరణి ఉపకరిస్తుందనుకున్నాడు. మతధోరణులు మార్చుకోకుండానే హిందువులు, ముస్లింలు కలసి పనిచేయవచ్చని గాంధి ఆశించాడు. ముస్లింలను మ్లేచ్ఛులని సనాతన హిందువులంటుంటే, హిందువులు కాఫిర్లని ముస్లింలు భావించారు. వేదికలపై మర్యాదలు యిచ్చిపుచ్చుకున్నా, హిందూ ముస్లిం భాయి భాయి అనేది హృదయపూర్వకంగా ఎవరూ నమ్మలేదు. ఖురాన్,గీత ఒకటే అంటే అసలే ఒప్పుకోలేదు. సర్ సయ్యద్ అహమ్మద్ ప్రారంభించిన వేర్పాటువాదం పెరిగిపోయి, పాకిస్తాన్ కు దారితీసినా గాంధి నమ్మకంలో మార్పులేకపోవడం ఆశ్చర్యకరం. మతపరంగా రాజకీయాల్ని చూస్తే వచ్చే చిక్కు ఏమిటో గాంధి గ్రహించలేదు.

ముస్లింలు ప్రతి సమస్యను మత ప్రాతిపదికగా చూస్తున్నారు. జాతీయ, మానవతా దృక్పధాలతో చూడాలని గాంధి ఆశించాడు. అది జరగలేదు. బ్రిటిష్ వారు వెళ్ళిపోతే,హిందు-ముస్లింల సమస్య సామరస్యంగా పరిష్కారమౌతుందనుకోవడం కూడా భ్రమే. సాంస్కృతిక,సామాజిక ధోరణులన్నీ మత ప్రాతిపదికతో చూచినంత కాలం,తీవ్ర అభిప్రాయ భేదాలు తప్పవు. మా మతమే అత్యున్నతమైందని,ప్రపంచ వ్యాప్తంగా మతాన్ని అందరిచేత అంగీకరింపజేయాలనే ధోరణి వున్నంత కాలం, మతసామరస్యం పగటి కలే.

స్వాతంత్ర్యానంతరం ముస్లింలు:

దేశవిభజన జరిగిన అనంతరం, పునర్వికాసానికి చక్కని అవకాశం లభించింది. సెక్యులర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. కాని అటు హిందూ సనాతనులు, ఇటు ముస్లిం చాదస్తులు