పుట:Abaddhala veta revised.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రాష్ట్రాలలో ఆధిక్యత పొంది,అధికారాన్ని చేబట్టింది. ముస్లింలీగ్ తన వేర్పాటు ధోరణి మరోసారి ప్రదర్శించి, కాంగ్రెస్ తో సహకరించలేదు. జమీందార్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సంస్కరణలు కోరగా, ముస్లిం జమిందార్లు వ్యతిరేకించారు. మహమ్మదాలీ జిన్నా నాయకత్వాన వేర్పాటు ధోరణులు బాగా ప్రబలాయి. బ్రిటిష్ వారు యధాశక్తి వారిని ప్రోత్సహించారు. 1939లో కాంగ్రెస్ మంత్రివర్గాలు ఆయా రాష్ట్రాలలో రాజినామా యిచ్చాయి. బ్రిటిష్ వారు చెప్పా పెట్టకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల్ని దించారని కాంగ్రెస్ అన్నది. ముస్లింలీగ్ మరోవైపున కాంగ్రెస్ ను దుయ్యబట్టింది.

1940 మార్చిలో జరిగిన లాహోర్ సమావేశంలో ముస్లింలు పాకిస్తాన్ కావాలన్నారు. అంతటితో ముస్లింలను జాతీయ జీవనంలో కలపడమనేది అసంభవమని తేలిపోయింది.

ఆ తరువాత పాకిస్తాన్ సృష్టిని జాతీయనాయకులు వ్యతిరేకించినా,స్పర్థలు పెరిగాయెగాని,తగ్గలేదు. గాంధి ఆశలన్నీ అడియాశలయ్యాయి. మత ప్రాతిపదికలతో సమస్యలు పరిష్కారం కావని ఉద్యమ నాయకులు గ్రహించలేదు.

ముస్లింలకు ప్రత్యేక సౌకర్యాలు,కేటాయింపులు కావాలని పట్టుబట్టిన జిన్నా రానురాను వేర్పాటును సమర్థించాడు. జాతీయజీవనంలో తమది వేరే ప్రవాహం అని జిన్నా అంటుంటే,కాదని నెహ్రూ వాదించాడు. జనాభా ప్రాతిపదిక కంటె అదనంగా తమకు స్థానాలు కేటాయించాలని కూడా జిన్నా కోరాడు. ముస్లింలు కోరే జాతీయవాదంతో కాంగ్రెస్ రాజీపడాలని జిన్నా ఉద్దేశ్యం. నెహ్రూ వ్యతిరేకించాడు. ఈ సంఘర్షణే క్రమేణా పాకిస్తాన్ కు దారితీసింది. ముస్లింలు వెళ్ళిపోయి, వేరే పొయ్యి పెట్టుకోడానికి హిందూ నాయకులకు యిష్టమే. ఎప్పటికైనా ముస్లింలతో తలనొప్పి అని వారి భావన. ముస్లింలు కోరింది యిచ్చి వారిని అట్టిపెట్టాలని కాంగ్రెస్ నాయకులు కొందరు భావించినా అది సాధ్యపడలేదు. ముస్లింలు జాతీయ రాజకీయ ప్రాతిపదికగా కోర్కెలు వెల్లడించలేదు. మత ప్రాతిపదికగా వారడిగేవన్నీ వున్నాయి. అంటే కాంగ్రెస్ ఆశించిన సెక్యులర్ ధోరణికి ముస్లిం కోర్కెలు విరుద్ధం. వారు ఇస్లాం మతాన్ని వ్యాపింపచేయాలని, రాజకీయాలు కూడా ఇస్లాం పరంగా వుండాలని అడిగారు. జమాతే ఉలేమా హింద్ అధ్యక్షుడు మౌలానా హుస్సేన్ అహమ్మద్ యీ విషయాలను సమావేశాలలోనే స్పష్టంచేశాడు. జాతీయ ముస్లింల ప్రకారం ఇండియాను క్రమేణా ఇస్లాం చెయ్యాలి. ఇది సాధ్యం కాదని గ్రహించి జిన్నా పాకిస్తాన్ కోరాడు. పాకిస్తాన్ కోరిన జిన్నా హిందువులను మత జాతీయవాదులని, గాంధి , నెహ్రూలు హిందూ ఛాందసులనీ చిత్రీకరించాడు. ఇస్లాం రాజ్యంలో కేవలం మతం వుండదు. రాజకీయాలు, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక రంగాలన్నీ ఇస్లాం నిర్దేశిస్తుంది. ఇస్లాంను మార్చేదేమీ లేదని వారి మతవాదుల ఉద్దేశం. కనుక ఇస్లాంతో రాజీ కుదరడం జాతీయవాదులకు సాధ్యపడలేదు. హిందువులు పాలించే ఇండియాలో ముస్లింలు స్వేచ్ఛగా వుండలేరని ఇస్లాం నమ్మకస్తుల ధోరణి.

దేశవిభజన జరగడం, లక్షలాది ముస్లింలు పాకిస్తాన్ పోవడం, అలాగే హిందువులు