పుట:Abaddhala veta revised.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కూడా సెక్యులర్ ధోరణులకు ఒప్పుకోలేదు. మొట్టమొదట యూనీఫాం సివిల్ కోడ్ వద్దన్నారు. తమ మతపరమైన చట్టాలే తమను పాలించాలని ముస్లింలు పెట్టుబట్టారు.

ముస్లింలలో ఎన్నో చీలికలు ఏర్పడ్డాయి. రాజకీయంగా వివిధ పార్టీలలోకి ప్రవేశించిన ముస్లింలు, అత్యధికంగా కాంగ్రెసులో మిగిలిపోయారు. కొద్దిమంది కమ్యూనిష్టు పార్టీలో వున్నారు. జమాతే ఇస్లామి ముస్లింల మతపరమైన విషయాలలో ఆధిపత్యం వహించింది. 1964 నాటికి ముస్లిం మజ్లీస్ ముషావరత్ ఏర్పడింది. వివిధ పార్టీలలో, ముఠాలలో వున్న చదువుకొన్న ముస్లింలు సైతం మతపరంగా ఒకే ధోరణి అవలంభించడం ప్రారంభమైంది. ఇస్లాంను నిశితపరిశీలనకు గురిచేయడానికి వీరు ససేమిరా, ఒప్పుకోలేదు. సెక్యులర్, ఆధునిక ధోరణిలో రాజ్యం కొనసాగించాలన్నప్పటికీ, ముస్లింలు తమకు ఇస్లాం ప్రాతిపదికే వుండాలన్నారు. ప్రజాస్వామిక విధానంలో ముస్లింలు యిమడలేకపోతున్నారు, ఒకప్పుడు పరిపాలన సాగించిన ముస్లింలు ఆ చరిత్రను మరువలేకపోతున్నారు. అల్పసంఖ్యాకవర్గాలుగా ప్రత్యేక అవకాశాల కొరకే వారు నిరంతరం తాపత్రయపడుతున్నారు. పోని ముస్లింలు తమ సంస్థల్ని, సమాజాలను ఆధునీకరణకు గురిచేస్తున్నారా,అంటే అదీ లేదు. రాజకీయ అధికారంకోసం కొన్ని పార్టీలు ముస్లిం ఓట్లకై వారేదడిగినా ఒప్పుకుంటున్నారు. ఇది ఆసరాగా తీసుకొని ముస్లింలు తమ మతపర హక్కులే కట్టుదిట్టం చేసుకుంటున్నారు.

ముస్లింలలో ఆధునిక దృక్పధం రావాలని, సెక్యులర్, మానవ విలువలు ఆచరించాలని, మతాన్ని సంస్కరించాలని, అవసరమైన మేరకు మతాన్ని విమర్శించాలని కొందరు యువ ముస్లింలు బయలుదేరారు. వారిపట్ల సనాతన ముస్లింల వ్యతిరేకత చాలా ఎక్కువగా వుంది.

హమీద్ దల్వాయ్ ఆధ్వర్యాన ముస్లిం సత్యశోధక సమాజం మహారాష్ట్రలో ఎన్నో కష్టాల్ని సనాతనులనుండి ఎదుర్కొనవలసి వచ్చింది. అస్ఖర్ అలీ ఇంజనీర్ ప్రాణాలకి ముప్పు ఏర్పడింది. 1971లో వీరు ముస్లిం స్త్రీ సమావేశాలు కూడా ఏర్పరచారు. స్త్రీ పురుషులు సమానం అనే ప్రాతిపదికగా ఒకే సివిల్ కోడ్ వుండాలని యీ స్త్రీ సమావేశం కోరింది. దేశంలో అక్కడక్కడా ఉత్తేజం పొందిన ముస్లిం యువతీ యువకులు మానవ హక్కులకు, ఒకే సివిల్ కోడ్ కు వత్తిడి చేసినా, అది పేలవంగానే మిగిలిపోయింది. ఛాందసుల వత్తిడి, ప్రభావం చాలా ఎక్కువగా వుంది. భారత ప్రభుత్వం గాని, వివిధ రాజకీయ పక్షాలుగాని ముస్లిం యువకులలో సెక్యులర్ ధోరణులకు అండగా నిలవలేకపోయాయి.

ముస్లింల ధోరణి మారాలని, వారి సంస్థలు ఆధునికరణం కావాలని పట్టుబట్టిన కొద్దిమంది మాట ఇంకా దేశవ్యాప్తంగా మారుమోగలేదు. ఎ.ఎ.ఎ. ఫైజి, ఆలంఖుంద్ మిరి, ఎం.ఆర్.ఎ.బేగ్,ఎం.హబీబ్, హమీద్ దల్వాయ్, అస్గర్ ఆలీ ఇంజనీర్, ఎం.ముజీబ్, అబిద్ హుసేన్ వంటి వారిని ముస్లింలలో వేళ్ళపై లెక్కించవచ్చు. ముస్లిమేతరులు కొందరు ఆధునీకరణ విషయమై ముస్లింలకు తోడ్పడడానికి సిద్ధంగావున్నా, స్వీకరించడానికి ముస్లింలు సహనం