పుట:Abaddhala veta revised.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెట్టెయ్యవచ్చు. హేతువాదం అడుగడుగునా శాస్త్రీయ పంధాను స్వీకరించి, తప్పులుచేస్తే దిద్దుకుంటూ, మనిషిని ముందుకు తీసుకెడుతుంది. ఇన్నాళ్ళుగా మనకు యిష్టమైన నమ్మకాలను దెబ్బకొడుతుంటే కొందరికి బాధగా వుంటుంది. అయినా మానవ వికాసానికి శాస్త్రీయపంధా మూఢనమ్మకాలతో రాజీపడలేదు.

ఒక విధంగా చూస్తే హేతువాద రచనలు శైశవదశలోనే వున్నాయి. యువతరం ఇప్పుడిప్పుడే హేతువాదాన్ని ఆకాంక్షిస్తున్నది.

హేతువాదమన్న జ్యోతిని చేబూని
నరుడు నడచివచ్చె నేటి స్థితికి
హేయమౌను బ్రతుకు హేతువాదమువీడ
నవయుగాలబాట నార్లమాట
తెలిసిన విషయాలు తెలియనివాటిలో
ఎంతో స్వల్పమనును హేతువాది
విఱ్ఱనీగ నతడు వేదాంతి కాడురా
నవయుగాలబాట నార్లమాట

ఇదీ సారాంశం:

ఎం.ఎన్.రాయ్, మానవతా ప్రభావం ఆంధ్రలో 1940 నుండీ కనిపించింది. ఆలోచనలలో శాస్త్రీయ దృక్పధానికి యీ తత్వం తోడ్పడింది.

(బెంగుళూరు తెలుగు మహాసభలకు 1990 మార్చి సమర్పించిన వ్యాసం)

- హేతువాది, సెప్టెంబర్ 1990


అంబేద్కర్ ను అంతం చేస్తున్నారు!
ఆపగలవారున్నారా?

దేశంలో ఎక్కడ చూచినా అంబేద్కర్ పేరు వినవస్తున్నది. వినిపించే వారెవరనుకున్నారు? కాంగ్రెసు, భారతీయ జనతాపార్టీ, జనతాదళ్ పార్టీలు అంబేద్కర్ ను భుజాన వేసుకొని మోస్తున్నాయి. పోటీపడి ఫోటోలు చేస్తున్నారు. అంబేద్కర్ ను తెగ పొగిడేస్తున్నారు. అన్ని పార్టీలు,అందరు రాజకీయవాదులు అంబేద్కర్ ను గౌరవిస్తుండగా ఇక కావాల్సిందేమున్నది! సాంఘీకన్యాయం రాకేం చేస్తుంది!

ఒకసారి జాగ్రత్తగా చరిత్రను పరిశీలించండి. హిందూమతం హింసతో జంతుబలులు