పుట:AarogyaBhaskaramu.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
vii

యును లేదు. అయ్యో! ఒక్కొక్క పద్యము. వారి యారోగ్యభాస్కరమందుఁ దిలకించిన గుండె నీఱగుచున్నది. కడుపు బ్రద్దలగుచున్నది. బాష్పధారలు ప్రవహించుచున్నవి. చూడు.

శా|| కాలుం జేయిము నాడునంతవఱ కీకల్యాణిఁ బోషింతునం

చాలోచింపక పత్రికావిషయమం దన్నాఁడ మున్నేను. నా

కేలే యాడెడిఁగాని కాలి కకటా! కీడ్నాటు వాటిల్లె. ఇం

కేలా పత్రికనడ్పుదు౯ భాస్కరా.

శా|| కాలి౯ నీవు కుదుర్చుకున్న నిఁకనేఁ గావించు కార్యంబెలే

దీలోకంబున. పత్రిక౯ మఱియు నాయిల్లాలినిం బిల్లలన్

పాలింపంగ నశక్తుఁడ౯ సరికదా! నాకడ్పె నేఁబూడ్చుకోఁ

జాల౯. జోలియదారికేని వలదే సంచార మోభాస్కరా.

శా|| కించిద్దూరపుటూళ్ళలోపలి సుహృద్గేహంబు లిం కంతకు౯

కించిద్దూరపు గ్రామబాహ్యములెపో కృచ్ఛ్రంబుగానుండ నా

సంచారంబెటు దూరదూరములకు౯ సౌఖ్యంబుగాసాగు? ఈ

కొంచెంపు౯ స్థితికన్నను౯ మృతియేమేల్ కొంచెంబిఁక౯ భాస్కరా.

ఈ రీతిని బ్రతిజ్ఞచేసి జీవితముకన్న ధర్మభాషాసేవయే ముఖ్యమని పాటుపడుచుండ నట్టిమహావివాక్కునుండి యిట్టి దీనమగుమాటలను వెడలఁజేయఁదగునా? దాశరథీ! ఈ సమయమున నీ సహాయములేకున్నఁ బరసహాయమెంతయున్నను నిష్ప్రయోజనమే. నీవు నాయిలువేల్పైనకతాన నిన్ను నమ్మి నాగురున కారోగ్యమిమ్మని యారోగ్యరాఘవమను. నీ చిన్నికృతిని లిఖియించితిని. నాగురుఁడు వ్రాయుచున్న గ్రంధమునకన్న నిది ఘనమాయని శంకింపకుము. ఆదురునిమార్గమునే త్రొక్కఁదలఁచితి. గురునియందుఁగల భక్తితాత్పర్యములే నన్నిట్లు ప్రేరేపించినవి. గురున కారోగ్యమిమ్మనికోరుట తప్పా? శిష్యధర్మము నెఱవేర్చుటతప్పా? నేనెట్టి సాయముఁజేయలేకున్నను నాభక్తివెల్లడించు పద్యములను గానుకగాఁ బంపుకొన్నాఁడను.

చ|| జలజలరాలెబాష్పకణజాలము లేఖను జూచినంతఁ గ

మ్గెలఁకులనుండి. దుఃఖమునకు౯ గుఱియయ్యె భవచ్చతిత్రయం

చలవిలపించినాఁడ మనమందున. సత్కవులైనమీరు మీ

కలమునుబూని దైన్యమునుగ్రక్కుచువ్రాయుటచోద్యమయ్యెడి౯ .

ఉ|| దైవముదాఁటరాద నెడు తత్త్వమెఱింగిన జ్ఞానులౌటచే

ఈవిధి దు:ఖభారమున నెంతయు మీపరిశుద్ధభావము౯

పావనమైనచి త్తమును బాడొనరింపఁగనేల? కష్టముల్

జీవితముండుదాఁక నివసించునె? సౌఖ్యము గల్గకుండునే?