పుట:AarogyaBhaskaramu.djvu/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఘ్నముగాఁ బత్రికసాగించుచుఁ గ్లిష్టసమయములలో శాస్త్రిగా రెట్టిశ్రర్ధవహించిరో యట్టిది సామాన్యులకు శక్యమగునో కాదో రఘరామా! నీకుఁదెలియదా?

సీ||లంకణంబులుచేసి లలిఁ బాసినపుడైన
            వెల్లడింపకదీని విడువలేదు.
ఏడేండ్లసుతుఁ డీల్లి యేడుచునపుడైన
            ప్రచురింప కిద్దానిఁ బాయలేదు.
సంతాననష్టికై చింతించునపుడైన
            ఊళ్ళ కియ్యది పంపకుండలేదు
ప్రథమకళత్రంబు పడిపోయినపుడైన
            వెలయింప కిద్దాని నిలునలేదు.

వ్యాజ్యెములు వచ్చి పైఁబడినప్పుడైన
మాసమాసంబుఁ బ్రకటింప మానలేదు.
సంధ్యతోపాటు దీనిని సత్యజింప
కీడ్చుకొనివచ్చుచున్నాఁడ నింతవఱకు

అను వీరి పద్యమునుజూడు. అట్టిప్రతిజ్ఞనుబట్టి పత్రికను నడిపించు పట్టాభిరామునకా యిట్టిరుగ్నత? పట్టాభిరామా~ నీ నామమును ధరించినవాని నిట్లు కష్టపెట్టుదువా? వారి ప్రవర్తన మెట్లుండునో వారు రచించిన

సీ|| కవితయు విద్వత్త గలదు నాకడఁగాని
             చెలఁగి యేగడబిడఁ జేయఁజాల.
శుద్ధవైదికవృత్తిఁ జూవట్టుదునుగాని
             వేషభాషలు పెక్కు వేయఁజాల.
ఉన్నంతకార్యంబె విన్నవింతునుగాని
             కలవి లేనివి యేవొ పలుకఁజాల.
గ్రక్కున నొరుల డగ్గఱఁ దలంకుదుఁగాని
             నిర్భీతి నటఁ జేరి నిలువఁజాల.

ప్రకృతకాలపరిస్థితుల్ బాగుగా నె
ఱుంగనట్టి యమాయికపుంగవుఁడను.... ...

అనుపద్యము సాక్ష్యమిచ్చును. భద్రాద్రిరామా! ఇట్టినాగురువర్యుఁగష్ట పెట్టుట ధర్మమగునా? వారి యనారోగ్యమునకై తపింపనివారెవ్వరు? వారినెఱిఁగిన ప్రతిమానవుండును దుదకు శత్రువులొకచో నున్నను వారుగూడ విచారింపకమానరని నా నమ్మిక. రామా! ఇంతమంది వారి యారోగ్యమునకయి ప్రార్థించుచుండ నిందఱిని జిన్నపుచ్చుట ధర్మముకాదు. వారిపిల్లలు పిల్లలు. ఇతరసాహాయ్య మేమి