పుట:AarogyaBhaskaramu.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూర్యభగవానుడా! భాస్కరాయని వేయివిధముల నిన్ను స్తుతించుచుండ మాగురున కారోగ్యము కలుగజేయకుండుట నీకు న్యాయముగాదు. ఈకవితాజపము చాలదా? లోకోపకారమునకై పాటుపడు మహనీయుఁడు. సనాతనధర్మతత్పరుఁడు. ఉభయభాషాప్రవీణుఁడు. దురాశఁబూని భోగభాగ్యముల కాశించెనా? ఆరోగ్యపదార్ధమొకటే కోరుచున్నాఁడు. అది నీకరుణాకటాక్షశ్రీలచే లభ్యమగును. నీవే శరణమని నిన్నే నిత్యముఁ గొల్చుచు నా రోగ్యభాస్కరము వ్రాయుచున్నాఁడు. ఆరోగ్యభాస్కరసారము.

ఉ|| గోడలుదూఁక నాదుమది గోరుటలేదు. బజారులందు బల్
ప్రోడనటంచుఁ వర్వులిడఁ బోయి చరించెడువాంఛలేదు. రో
చేడెలఁగూడి యాడుటకుఁ జిత్తమునందుఁ దలంపులేదు. నా
ఈడున కర్హమైన బల మిచ్చినఁ జాలును నాకు భాస్కరా!

అను నొక్కపద్యపద్యమునం దిమిడియుండెను. మిత్రుఁడగు ప్రసాదరావు గారికైనను మాటదక్కించవాయని శాస్త్రిగారు

చ|| వెలగలమందు లూరకయ వేళ కొసగుటెకాక స్వీయమౌ
నిలయమునందె నిల్పుకొని నేఁటికి మాసయుగంబునుండి ని
ర్మలుఁడు ప్రసాదరావు తన మంచిని వెల్లడిచేయుచుండె ఆ
పలఁతి సదుద్యమంబు ఫలవంతముఁ జేయఁగదయ్య భాస్కరా!

అని ప్రార్థించుచుండిరి.

శ్లో|| పూర్వజన్మకృతంపాపం వ్యాధిరూపేణ బాధతే
తచ్ఛాంతి రౌధధై ర్దానై ర్జపహోమసురార్చనైః

అని సురార్చనమే కడపటి సాధనముగాఁ బ్రాక్కవులును వాడియున్నారు. కార్యమున సాధించియున్నారు. దైవతారాధన వ్యర్థముగాదు.

-------- ఆరోగ్యరాఘవము --------
పరమేశ్వరా!

కవికులకోటికి దుర్భర దుస్సవాదారిద్ర్యమొకండు వరముగ నిచ్చితివి. పోనీ సాహిత్యలక్ష్మీసంపన్నులమని దారిద్ర్యబాధ సరకుగొనక యెట్లో జీవితమును ధర్మనిష్ఠితబుర్ధిచే నెట్టుచుండ సారస్వతసేవయును జేయుటకు వీలులేని రోగమును శరీరమున కెక్కించితివా? నాగురుని బాధించుట పాడిగాదు. కుయోమొఱో యనుచున్నను వినవా? సీతాపతీ! వీరు నా పరమగురువులు. నా కవితాసంఘము నుద్ధరింపబద్ధకంకణులు. వీరి కవితానైపుణ్యము కొనియాడఁదగినది.

సీ|| స్కాందస్థ నాగరఖండ మంతయును దె
న్గించి పూర్తిగఁ బ్రకటించినాఁడ.

అని వీరు వ్రాసిన పద్యపాదమునుబట్టి వీరి యుభయభాషాప్రావీణ్య మెట్టిదో తెలియందగు అభినవసరస్వతీ పత్రికాధిపతులై యిరువదియైదు సం|| లనుంచి నిర్వి