పుట:AarogyaBhaskaramu.djvu/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
viii
ఉ|| కావున ధైర్యమూనుఁడు సుఖంబు బలంబు లభించు మీకు ఇం

కేవిధమెనకష్టములు నెన్నడుఁ గంపడఁబోవు. సౌఖ్యమే

జీవితమందుఁ గంపడు ప్రసిద్ధికినెక్కిన పత్రికావిధుల్

కేవల మాపరాత్పరుని లీలలఁ జక్కఁబడు౯ గురూ త్తమా!

ఉ|| దేనికినైననేమి పరదేవత సత్కృప చిల్కినంతట౯

గాని కృతార్థతం బడయఁగా ననుకూలముగాదు. మీరిటుల్

మానసమం దధైర్యమును మాటికిమాటికిఁ దాల్పనేల? ప్ర

జ్ఞావిధులైనమీ కిల నసాధ్యములెయ్యని చెప్పుమో గురూ!

ఉ|| మీకన్నం గడుఁ జిన్నవాఁడనగుట౯ మీకిట్లు బోధింపఁగా

నాకుంజెల్లునె? బుద్ధిపాటవమునైనం గాంచఁగానైతి, మీ

కేకార్యంబుననైన సాయపడఁగా నీనాకు శక్యంబొకో?

శ్రీకాంతుండె సమర్థుఁ డన్నిగతులం జింతించి రక్షింపఁగ౯

రామచంద్రా! నీకాళ్ళంబడి ప్రార్థించుచున్నాఁడ. నా ప్రార్థన ఫలవంతమగునట్లుచేయుము. నాగురునికి సంపూర్ణాయురారోగ్యశ్రీలను బ్రసాదింపుము.

శా|| శ్రీరమ్యంబుగఁ బత్రికావిషయముల్ చేకూర్చిపోషింపవే.

ప్రారంభించినదాది విఘ్న మెపుడు౯ వాటిల్లఁగానీక క్షే

మారోగ్యం బది యున్నఁజాలుననుచుం బ్రార్థించుచున్నార లా

ప్రారంభమ్మును సాఁగజేయు మిలలోఁ బట్టాభిరామప్రభూ!

... మొదట రు 5 లు పంపితిని.... తక్కిన రు 5 లు పంపితిని..... నేను విళేషించి సాయముచేయఁజాలనందులకును నింతస్వల్పము రెండుసారులు పంపినందులకును సిగ్గుపడుచున్నాను. నా కెన్ని చిక్కులున్నను బరమేశ్వరుఁ డిట్టిసందర్భములలోఁ గొంచెమో గొప్పయో మిత్రధర్మము నెఱవేర్చుకొను భాగ్య మిచ్చినఁ జాలునని ప్రార్థించుచున్నాఁడను...

రామసుబ్బారాయుఁడు బి.యే.
కడియము- తూ|| గో|| డి||
18-9-88 శ్రీముఖసం|| భాద్రపద బ ౧౪

... మీ భాస్కరమకుతపుఁ బద్యములు త్రిలింగలోఁ జడివి యానందించినాను...ప్రసాదరావుగారి యభిప్రాయము ననుసరించియే ప్రవర్తింపుఁడు... జాతకవిషయమును బరిశీలించికొనుఁడు. భాస్కరారాధన మానకుఁడు...

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, శతావధాని.
కొల్లాపురము
శ్రీముఖ సం|| అశ్వయుజ బ ౧౩ (17-10-88.)

...ఆరోగ్యభాస్కరము ప్రచురించుచుంటిరి. కనుక నానిమిత్తమై 50 ప్రతులెక్కువగా నుంచవలెను. అందుకగు పేపరు బైండింగుచార్జీలు నాపైనఁగట్టవచ్చును.

విధేయుఁడు, రామసుబ్బారాయుఁడు యే.
----------