Jump to content

పుట:AarogyaBhaskaramu.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ix
చేటపఱ్ఱు. ఏలూరుతాలూకా - ప|| గో|| డి||
శ్రీముఖ సం|| కార్తిక శు౨- 21-10-1988.
కం|| పట్టాభిరామశాస్త్రి! పెట్టకు తడి కంట. తనదు వేయికరముల౯.

పెట్టనికోటగ నిడి నీ కెట్టివిపత్తులను జేరనీ కినుఁ డోము౯.

తే|| కలి సనాతనధర్మరక్షణముకొఱకు

పాటుపడునట్టి భూసురవరుఁడవౌట

తా సనాతనుఁడౌటను దరణి నీకు

మిత్రముఖరూపముల నిఁక మే లొసఁగఁడె?

తే|| సామయుండైన పట్టాభిరామశాస్త్రి

కవి తపశ్శాలి సుగుణుండు ఘనయశుండు.

నీప్రసాదాన కర్హుఁడు. నేఁ డతనికి

ఆయురారోగ్యముల నిడు మంబ! దుర్గ!

గుండు శేషయ్య.

--- తమరుపంపిన కవరు చేరినది. తమకుఁ డిరిగి యారోగ్యము పూర్తిగాఁ జెడుట యాపరేష౯ జరుగుట మొదలగు విషయములు చూచి మిక్కిలి దుఃఖించితిని.

ఆరోగ్యభాస్కరప్రభావము.
ఉ|| వచ్చినలేఖఁజూచి గురువర్యునకు౯ సుఖమబ్బెనంచు లో

హెచ్చుగ సంతసంబును వహించితి నెమ్మనమందు. భాస్కరు౯

నిచ్చలు భక్తిభావములు నిండ భజించినదానికి౯ ఫలం

బచ్చుపడంగ నయ్యె. పరమాత్ముని సేవలు వ్యర్థమౌనొకో.

ఉ|| పట్టిపట్టువీడ కల భాస్కరుని౯ భజియించినందు కి

ప్పట్టున సౌఖ్యమబ్బె. కనుపట్టె శుభంబులు. దేహదార్థ్యము౯

నెట్టినఁ గల్గె. ఔషధము నేర్పుగ నిచ్చెఁ బ్రసాదరావు. ఇం

కిట్టివె భాగ్యసంపదలు నేర్పడు మీకుఁ జిరాయురున్నతి౯.