పుట:AarogyaBhaskaramu.djvu/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
35
ఉ|| ఉరికంబంబుసమీపవెదిపయి వధ్యుండట్లు నే నయ్యెడ౯

కఱకుంగత్తుల యాపరేషనుగదిం గాల్వెట్టుడు౯ వచ్చిర

ప్డిరువు ర్డాక్టరు. లిచ్చిరంత స్మృతివో నేమందొ తత్సత్తచే

ఎఱుఁగ౯ రాకెది నిద్రపట్టినటు లయ్యె౯ నా కహో భాస్కరా!

ఉ|| కోయఁగనౌ ప్రతీకమును గోసి ప్రమాదములే కొకింతయు౯

తీయఁగనైన నీరమును దీసి స్వకీయపు నేర్పుకల్మిమై

చేయఁగనున్నదంతయును జేసి క్రమంబుగ వార లాపల౯

పోయిరి తెల్విలేనినను భూశయనంబునఁ జేర్చి భాస్కరా! ౨౩౯

ఉ|| భూశయనంబున౯ గడియప్రొద్దు చలింపకయున్న నాదుపై

ఆశదొలంగెఁ జుట్టలకు. హాయనుచుండిరి. కాని యింతలో

క్లేశములొందువార లిల లేరని కన్నులు విప్పి చూచితి౯.

దేశము గొడ్డువోవదొకొ నే ధుతజీవుఁడనైన భాస్కరా! ౨౪౦

శా|| ఈ యారోగ్యవిహీనతం గుడుచువారెవ్వారు? దారిద్ర్యము౯

మోయంగాఁగలవారలెవ్వ? రిడియెంబోనాకుఁ దద్బ్రహ్మ దీ

ర్ఘాయుష్యంబు. ననర్థితుండతఁడు తా. ఆరోగ్యముంగూర్చి యెం

తో యభ్యర్థితుఁడీ. వటయ్యు నిడ వోహో దాని నోభాస్కరా!

ఉ|| ఆవిధి ధాతయిచ్చిన చిరాయువు గల్గుటఁజేసి యెంతయు౯

చేవదొలంగియుండియును జీవముఁ బాయను నేను. వెండి ఛి

న్నావయవంపుఁజర్మమది యల్లుకొనె౯ దివసాష్టకంబులో.

పోవఁగనయ్యెఁ దద్వికృతి. పూర్వపుటాకృతివచ్చె భాస్కరా!

మ|| చనితిం గాల్నడతోడఁ బంచదశఘస్రంబందున౯ బాగుచే

సిన యాడాక్టరునింటి. కాయన కడు౯ శిష్టుం. డసిష్టాంటుస

ర్జను. మధ్వావనిదేవవంశజుఁడు. పేర౯ మాధవాచార్యుఁ. డా

ఘను కారుణ్యముకల్మి నింతతొరగా గట్టెక్కితి౯ భాస్కరా!

ఉ|| ఆవిషయంపులోపమది యంతయుఁ దీఱెను గాని కాలితీఁ

పావిధిగానె యున్నయది. అండగనీరమె మూలమైనచో

పోవుచునుండె నప్డెయది. పోవదుకావున నుష్ణమూలమం

చేవియొ మందు లీఁగడఁగె నింకను డాక్టరు నాకు భాస్కరా!