పుట:AarogyaBhaskaramu.djvu/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
34
శా|| ఇచ్చె౯ గుండెదడం గుదిర్చి మఱి మూడింజక్షమల్పాప మా

సచ్చిత్తుండు ప్రసాదరావు. లవము౯ జంఘామయం బాఁగ. దే

నెచ్చో నేగుదు? ఏమిసేయుదు? కటా! ఎవ్వా రిఁక౯ దిక్కు? నీ

హెచ్చెల్లం దెలియంగ వచ్చినదిలే యీనాఁటికి౯ భాస్కరా!

చం|| ప్రతినయొనర్చె నాదు పదబాధను మానిపిపుత్తునంచు సు

ప్రతుఁడు ప్రసాదరావు. తన వైద్యత కించుక త్వత్ర్ససాదము౯

జతయయియుండ భాస్కరుని సన్నుతిసేయుచు నొక్క పద్యపు౯

శతకము వ్రాయుమంచుఁ బెలుచం బురికొల్పెను నన్ను భాస్కరా!

ఉ|| నమ్మఁగలేకపోతి నిను. నామది త్వాదృశదేవతాసమూ

హమ్మెటువంటిదైనది యథార్థ మెఱింగియుఁ దత్ప్రణీత

క్యమ్మున భ్రాంతమై మరల నందుఁ బ్రవిష్ట. మిఁకద్ది యెన్నిప

ద్యమ్ములనల్లునో. శతకమయ్యె మఱొక్కటియయ్యె భాస్కరా!

చ|| ముగిసెఁ బ్రసాదరావువని ముష్కముమీఁదికినెట్టె బల్మిఁ ద

ద్రుగతిశయమ్ము. నీరుదిగి తొల్లిటికంటె నొకింత భారమై

అగుపడుచుంటఁ జెప్పుటయు నయ్యది హేతువుకాదు కాలిదౌ

తెగులునకంచుఁ బల్కె మును. తెల్పెనిటిప్పు డతండు భాస్కరా!

ఉ|| బుడ్డను నమ్మి యేటఁబడుపోల్కి విశాఖపురిం గరంబు పే

ర్పడ్డది యాసుపత్రి. అటఁ బాలునురొట్టెయు వారెయిచ్చి యీ

బుడ్డనుగోసి నీర్దిగిచిపుత్తురనె౯ మఱి. అద్ది గుండెపై

పెడ్డను గొట్తినట్టులయి భీతిలితిం జన నందు భాస్కరా! ౨౩౫

ఉ|| భీతిలి యింటికిం జనితి. పెండ్లయి బిడ్డలఁ జూచుకొంటి. నా

వ్రాఁతకుఁ గుంది యందుఁ బదివాసరముల్ వసియించి వెండియు౯

భూతముచాడ్పునం బయికిఁబొంగిన వేఁడిమి నాఁపివేయ నే

చేఁతయుఁ జేయలేక కడు క్షీణబలుండనునైతి భాస్కరా! ౨౩౬

ఉ|| ఈగతి లేవలేకయును నింతిని బిల్లలఁ దోడికొంచు నే

నేగతి నర్సరాట్పురికి ఇంతటిక్షీణబలుండ వండ మే

లాగునఁ జీలిపించెదని లావుభయంపడు బంధుసంచయం

బాఁగి ప్రవిష్టుఁడైతిఁ దుద కాంగ్లభిషగ్వరశాల భాస్కరా!