పుట:AarogyaBhaskaramu.djvu/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
29
శా|| అక్రూరుం డెదొ చెసినాఁడు. చనినాఁడామీఁద నాయాతుఁడౌ

శుక్రండే పడఁద్రోసెఁ బూర్తిగ ననుం హూ. భార్గవుండౌట జా

తక్రోధుండయి యుండఁబోలు నిటులం దా. అష్టమాధీశుఁడౌ

ఈక్రవ్యాద్గురుఁ డింతకెక్కుడుశుభం బీనేర్చునే భాస్కరా! ౧౯౬

ఉ|| శుక్రున కష్టమాధిపత జ్యోతిరభిజ్ఞులు కాదు దోషమం.

ద్రేక్రమమయ్యె దోషి యిఁక? ఏఁగవిఁ దాఁగవియా యటంచున౯

సక్రుధుఁడై కనంగనగు. సాగ్రహ మాగ్రహ మాచరించు నీ

అక్రమ మాఁపఁజాలవొకొ యై గ్రహరాజవుకూడ భాస్కరా!

చం|| ఎవరు స్వజాతిపట్ల వహియిం త్రభిమానము. గాన నట్లె తా

కవి కవికి౯ సహాయపడఁగాఁ దగియుండ నిటుల్ రచించెఁ గా

కవిత నితండు. కాకవియుఁ గాంచు స్వజాతిని బ్రీతితోడ. ఈ

అవని స్వజాతివైరు లొక యా భషకంబులెకాదె భాస్కరా! ౧౯౮

చం|| ద్విజులకు జాతివైరమది తీఱక వర్తిలుచుండు నెంతయు౯.

స్వజనమునాక యోరుపులు స్వాంతమునందున లేక యొండొరుల్

విజితులఁజేయుపొంటెఁ గల వేరము పెంచుచునుంద్రు. కాన నీ

ద్విజుఁడు ద్విజుండనైన నను ద్వేషమునం గనఁబోలు భాస్కరా!

మ|| తనుభావేశ్వరుఁడౌచు లాభముననే తానుండుచు౯ నాకుఁ ద

త్తను సౌఖ్యాదికలాభ మీక తనువే తార్మారు గావించెడి౯.

తనుజాతాంతరలాభకృత్త్వ మొకమేల్ తప్ప౯ విచారింఓ నీ

తనికావించిన వేఱుమేలు గలదే తథ్యంబుగా భాస్కరా! ౨౦౦

ఉ|| కాలికి నొప్పిగూర్చె. అది కాల్కదలింపకయుంచనేర్చె. సు

శ్రీలవిధంబు మార్చె. జ్వరశేషము వీడనిలా గొనర్చె. పా

పాలకు నెల్ల భైరవుఁడు భార్గవుఁడన్నను. అట్టి క్రూరుఁ దా

మేలొ శుభగ్రహంబుగను నెంచెడి జ్యౌతిషికాళి భాస్కరా!

మ|| స్వదశారంభమునుండి యీతఁ డిటులే సౌఖ్యంబు వోకార్చి క

ష్టదశల్ తారుచుచున్నవాఁడు. గడచె౯ సంవత్సరద్వంద్వమా

కుదశ౯. వత్సర మింకనున్నయదియు౯. కోణుండు త్వత్సూనుఁడే

విదశానాథుఁడు ప్రస్తుతంబు. శుభము౯ వేకూర్పవే భాస్కరా!