Jump to content

పుట:AarogyaBhaskaramu.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
30
చం|| గ్రహపతివౌట నీదునుడి కాదనఁడాతఁడు. తండ్రి వింక. తా

సహితము యోగకారుఁడుగ శాస్త్రవిదీరితుఁ డట్లుగాన నా

కు హితముసేయుపొంటె ననుకూలము కాలము. వేగఁ బాదరు

గ్రహితునిజేయుమంచుఁ గృప గట్టిగఁ బట్టికిఁ జెప్పు భాస్కరా!

ఉ|| గ్రుడ్డిదియైనయెద్దు ససికోయనిచేనునఁ బడ్డరీతి నీ

గ్రుడ్డియు నేగుచుండె. ననుఁ గుందఁగఁ జేయుచునుండె. కాన మా

ఱొడ్డి మదీయపాదరుజ యోజ నశింపఁగఁజేయుమయ్య నీ

బిడ్డకుఁజెప్పి యీ విదశ. ప్రేముడిఁ జూపఁ గదయ్య భాస్కరా!

మ|| పగవాఁడైనను నీదుక్షేత్రమగు నా పంచాస్యమందేకదా

సగముంజచ్చివసించుచుండెఁ గవి తా. సంబోధ్యమానుండుగా

మొగమీయంగలఁ డప్డెనీకు. కనుక౯ బోధించి యెట్లేని నీ

విఁగ నన్నేఁచకయుండఁజేయఁగదవే యేంరొక్కెద౯ భాస్కరా!

మ|| మునుపే ముక్కిడి పైని దగ్గుపడిసెమ్ముం గల్గెనన్నట్లు నా

ఘనపద్వ్యాధికిఁదోడు ప్రస్తుతమునం గల్గె౯ శిరోవ్యాధి. నె

మ్మనము౯ నీపయిఁజేర్చి సంతతమునుం బద్యంబులంజెప్పు చీ

పెనువ్యాధిం గొనితెచ్చుకొంటి నెపుడుం బీడంప న౯ భాస్కరా!

ఉ|| అద్దమరేయియైనను రవంతయు నూఱటఁ జెంద దింతయు౯

నిద్దురపట్టనీదు మది. నిద్ర యొకించుక పట్టినం గల౯

పద్దెముల౯ రచించుపని మానదు. వేసర దించుకేని. నా

హృద్దశ యిట్టులున్నయది. ఏమగునో యిఁక దీన భాస్కరా! ౨౦౭

ఉ|| పంచదశాబ్దమందె ననుఁ బట్టెఁ గవిత్వపుభూత. మెంతయు౯

సంచలనంబుగూరిచె మనంబున. కార్యులు మెచ్చునట్లు వ్రా

యించెను బెద్దగ్రంతహ్ములె. ఎన్నడెఱుంగ శిరోభరంబు. ని

న్నెంచిరచించుపదూముల నిట్లుఘటిల్లె నదేమొ భాస్కరా! ౨౦౮

శా|| తానంబుం బొనరించుపట్ల మఱి సంధ్యావందనప్రక్రియ౯

బోనంబుం దినువేళఁ బండుకొనినప్డు౯ శౌచవిధ్యాదుల౯

దాన౯ దీన ననంగనేల యెపుడుం ద్వత్పద్యసంధానమే

ధ్యానంబైనది నాకు. ఏమియగునో తర్వాత నో భాస్కరా! ౨౦౯